KGF-2 :“కేజీఎఫ్ 2″పై సిటీ పోలీస్ క్రేజీ మీమ్

Surya Prakash   | Asianet News
Published : Apr 09, 2022, 09:52 AM IST
KGF-2 :“కేజీఎఫ్ 2″పై  సిటీ పోలీస్ క్రేజీ మీమ్

సారాంశం

“కేజీఎఫ్ 2” ట్రైలర్ లో “వయోలెన్స్… వయోలెన్స్… వయోలెన్స్…. ఐ డోంట్ లైక్ ఇట్… ఐ అవాయిడ్… బట్ వయోలెన్స్ లైక్స్ మీ” అంటూ చెప్పే పవర్ ఫుల్ డైలాగ్. ‘హెల్మెట్ మీ హెల్ మేట్ ను దూరంగా ఉంచుతుంది’ అంటూ రోడ్ సేఫ్టీకి సంబంధించిన సలహా ఇచ్చారు అందరికి. సోషల్ మీడియాలో ఈ పోస్టర్ వైరల్ అవుతోంది.


‘కేజీఎఫ్- ఛాప్టర్ 1’ కన్నడ చిత్రం పాన్ ఇండియా మూవీగా విడుదలై అనూహ్య విజయం సాధించిన సంగతి తెలిసిందే.  ఈ సినిమా రెండో భాగంగా వస్తోన్న ‘కేజీఎఫ్ – ఛాప్టర్ 2’ ఏప్రిల్ 14న జనం ముందు విడుదల అవుతోంది! ‘కేజీఎఫ్ – 2’కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ సినిమాను అత్యంత భారీవ్యయంతో నిర్మించారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నిర్మితమైన ‘కేజీఎఫ్’ సినిమా అందరినీ అలరించింది. అదే తీరున ఈ సినిమా రెండో భాగం కూడా మురిపించనుందని సినీఫ్యాన్స్ ఆశిస్తున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాన్ని ‘ఐ మ్యాక్స్’ ఫార్మాట్ లోనూ రూపొందించారు. ప్రపంచవ్యాప్తంగా ‘ఐ మ్యాక్స్’ ఫార్మాట్ లో విడుదలవుతున్న తొలి కన్నడ చిత్రంగా ‘కేజీఎఫ్- ఛాప్టర్ 2’ నిలవనుంది.  ఇక ఈ క్రేజ్ ని హైదరాబాద్ సిటీ పోలీస్ లు ఉపయోగించుకుంటున్నారు.

 
“ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు “హెల్మెట్” తప్పక ధరించండి, సురక్షితంగా మీ గమ్య స్థానాన్ని చేరుకొండి. ట్రాఫిక్ నియమాలు పాటిద్దాం, ఇతరులకి ఆదర్శంగా నిలుద్దాం” అంటూ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. దానిపై “హెల్మెట్ హెల్మెట్ హెల్మెట్… ఐ డోంట్ లైక్ హెల్మెట్… బట్ హెల్మెట్ సేవ్స్ మీ… ఐ డోంట్ అవాయిడ్ హెల్మెట్” అని ఉంది.

 

“కేజీఎఫ్ 2” ట్రైలర్ లో “వయోలెన్స్… వయోలెన్స్… వయోలెన్స్…. ఐ డోంట్ లైక్ ఇట్… ఐ అవాయిడ్… బట్ వయోలెన్స్ లైక్స్ మీ” అంటూ చెప్పే పవర్ ఫుల్ డైలాగ్. ‘హెల్మెట్ మీ హెల్ మేట్ ను దూరంగా ఉంచుతుంది’ అంటూ రోడ్ సేఫ్టీకి సంబంధించిన సలహా ఇచ్చారు అందరికి. సోషల్ మీడియాలో ఈ పోస్టర్ వైరల్ అవుతోంది.

 తెలుగులోనూ విడుదలవుతోన్న ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’ ఏప్రిల్ 14న ప్రసాద్ ఐమ్యాక్స్ థియేటర్ లోనూ ప్రదర్శితం కానుంది.  భారీ అంచనాలతో , బిజినెస్ పరంగానూ కన్నడ నాట సరికొత్త చరిత్ర సృష్టిస్తోన్న ‘కేజీఎఫ్-2’ ఐ మ్యాక్స్ స్క్రీన్ పై ఎంతలా అలరిస్తుందో చూడాలి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Thanuja: కళ్యాణ్ పాడు చేసుకుంటున్నాడు, తనూజలో సడెన్ గా ఈ మార్పు దేనికోసం.. సూటిగా ప్రశ్నించిన అభిమాని
Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్