Sunny leone: మంచు విష్ణుకు అలా దొరికిపోయిన సన్నిలియోన్,షాక్..., వైరల్ వీడియో

Surya Prakash   | Asianet News
Published : Apr 09, 2022, 09:43 AM IST
Sunny leone: మంచు విష్ణుకు అలా దొరికిపోయిన సన్నిలియోన్,షాక్..., వైరల్ వీడియో

సారాంశం

ఈ సినిమా షూటింగ్ గ్యాప్ లో సన్నీ ఒక ప్రాంక్ ప్లే చేసింది. ఆ వీడియో ఆమె సోషల్ మీడియాలో షేర్ చేస్తే వైరల్ అయ్యింది. అటు విష్ణుకి, ఇటు సన్నీకి ట్యాగ్ చేస్తూ ఫన్నీ కామెంట్స్ కూడా పెడుతున్నారు వారి ఫాలోవర్స్.


మంచు విష్ణు హీరోగా ‘గాలి నాగేశ్వరరావు’ అనే సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే.  సన్నిలియోన్ ఈ చిత్రంలో కీ రోల్ చేస్తోంది. కొంత గ్యాప్ తర్వాత ఆమె నటిస్తున్న తెలుగు చిత్రమే ఇదే.  ఆమె ఈ సినిమాలో రేణుక అనే పాత్ర చేస్తోంది. ఇంట్రస్టింగ్ క్యారెక్టరైజేషన్ తో మంచు విష్ణు ఈ  సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకి కోన వెంకట్, చోటా.కె.నాయుడు, అనూప్ రూబెన్స్ వంటి క్రేజీ టెక్నీషియన్స్ సెట్ అవ్వడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఇక ఈ సినిమా షూటింగ్ గ్యాప్ లో సన్నీ ఒక ప్రాంక్ ప్లే చేసింది. ఆ వీడియో ఆమె సోషల్ మీడియాలో షేర్ చేస్తే వైరల్ అయ్యింది. అటు విష్ణుకి, ఇటు సన్నీకి ట్యాగ్ చేస్తూ ఫన్నీ కామెంట్స్ కూడా పెడుతున్నారు వారి ఫాలోవర్స్. ఈషాన్ సూర్య దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు కోన వెంకట్.

 డా. మంచు మోహన్ బాబు ఆశీస్సులతో అవ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో  ఈ సినిమా తెరకెక్కుతోంది. కథ, స్క్రీన్ ప్లే తో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించనున్నారు కోన వెంకట్.  నందు డైలాగ్స్ అందిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చుతున్నారు. జి.నాగేశ్వరరెడ్డి స్క్రిఫ్ట్ అందించారు. ఇప్పటివరకూ చేయని పాత్రలో ఈ సినిమాలో కనువిందు చేయబోతున్నట్లు చెప్పారు విష్ణు. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలను  ప్రమోషనల్ కార్యక్రమాల ద్వారా వెల్లడించడానికి ప్లాన్ చేస్తోంది చిత్రం యూనిట్.

 

PREV
click me!

Recommended Stories

చిరంజీవితో కలిసి 15 చిత్రాల్లో నటించింది.. కానీ చుక్కలు చూపించింది.! ఆ స్టార్ హీరోయిన్ ఎవరంటే
Gunde Ninda Gudi Gantalu Today 12 డిసెంబర్ ఎపిసోడ్: నీకు ముందే పిల్లలు ఉన్నారా? రోహిణిపై మీనా అనుమానం, ప్రభావతి తిక్క కుదర్చడానికి సుశీలమ్మ ఎంట్రీ...