రామ్ పోతినేని ‘ది వారియర్’కు భారీ రెస్పాన్స్.. మిలియన్ల వ్యూస్ తో ట్రెండ్ అవుతున్న టీజర్..

Published : May 15, 2022, 04:44 PM ISTUpdated : May 15, 2022, 04:45 PM IST
రామ్ పోతినేని ‘ది వారియర్’కు భారీ రెస్పాన్స్.. మిలియన్ల వ్యూస్ తో ట్రెండ్ అవుతున్న టీజర్..

సారాంశం

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తాజాగా నటిస్తున్న చిత్రం ‘ ది  వారియర్’ (The Warrior). ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. తాజాగా రిలీజ్ అయిన ది వారియర్ టీజర్ ప్రస్తుతం మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతోంది. టాప్ వన్ లో ట్రెండ్ అవుతోంది.  

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని (Ram Pothineni), దర్శకుడు ఎన్ లింగుస్వామి కాంబినేషన్ లో వస్తున్న యాక్షన్ డ్రామా ‘ది వారియర్’ (The Warrior). ఇస్మార్ట్ శంకర్, రెడ్ సినిమాలత తర్వాత మరోసారి మాస్ విజువల్స్ చూపించేందుకు సిద్ధమవుతున్నాడు హీరో రామ్. ఈ చిత్రం నుంచి రిలీజ్ అయినా పోస్టర్స్, సాంగ్స్ కూడా సినిమాలో బోలెడంత మాస్ కంటెంట్ ను ఉన్నట్టు చూపిస్తున్నాయి. ఇఫ్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, ఫస్ట్ సింగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా రామ్ పోతినేని పుట్టిన రోజు సందర్భంగా నిన్న టీజర్ ను వదిలారు. ఈ టీజర్ ఊహించని విధంగా యూట్యూబ్ లో దూసుకుపోతోంది.

కాగా ది వారియర్ టీజర్ కు ప్రస్తుతం ఆడియెన్స్ నుంచి గట్టి రెస్పాన్స్ వస్తోంది. తెలుగు, తమిళ భాషలో రిలీజ్ అయిన ఈ టీజర్ భారీ స్థాయిలో వ్యూయర్ షిప్ ను దక్కించుకుంటోంది. ఇంకా 24 గంటలు పూర్తికాక ముందే 10 మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతోందీ టీజర్. ఊరమాస్ విజువల్స్ తో టీజర్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోంది. రామ్ పోతినేని చెప్పే ఒక్కో డైలాగ్ సినిమాపై భారీ హైప్ ను పెంచుతున్నారు. మొత్తంగా ‘ది వారియర్’తో కొత్తదనం చూపించారు హీరో రామ్. దీంతో ఆయన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

సత్య ఐపీఎస్ గా రామ్ పోతినేని ‘ది వారియర్’లో కనిపించనున్నారు. విజిల్ మహాలక్ష్మి పాత్రలో కృతి శెట్టి (Krithi Shetty) నటిస్తోంది. టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. రామ్ పోతినేని మాస్ విజువల్స్ భారీ అంచనాలను నెలకొల్పేలా ఉన్నాయి.  శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్నారు. జులై 14న వరల్డ్ వైడ్ ‘ది వారియర్’ మూవీ రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీతం అందిస్తున్నారు. 

 

PREV
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు