NTR: ఆర్ ఆర్ ఆర్ ఎఫెక్ట్.. టాప్ ప్లేస్ లోకి దూసుకొచ్చిన ఎన్టీఆర్.. ప్రభాస్, బన్నీ, మహేష్ వెనక్కి! 

Published : May 15, 2022, 02:03 PM IST
NTR: ఆర్ ఆర్ ఆర్ ఎఫెక్ట్.. టాప్ ప్లేస్ లోకి దూసుకొచ్చిన ఎన్టీఆర్.. ప్రభాస్, బన్నీ, మహేష్ వెనక్కి! 

సారాంశం

ఆర్ ఆర్ ఆర్ మూవీతో ఎన్టీఆర్, చరణ్ ఇమేజ్ మరో లెవెల్ కి వెళ్ళిందనడంలో సందేహం లేదు. ఈ క్రమంలో ఈ ఇద్దరు హీరోలు పాపులారిటీలో టాప్ పొజిషన్ కి వచ్చేశారు. ఎన్టీఆర్ అయితే ఏకంగా టాప్ ప్లేస్ కొట్టేశాడు.   

రాజమౌళి చిత్రాలంటే రికార్డులకు కేర్ ఆఫ్ అడ్రస్. అలాగే  ఆయన చిత్రాలతో హీరోల ఇమేజ్ నెక్స్ట్ లెవెల్ కి చేరుతుంది. ఇక లేటెస్ట్ రాజమౌళి సెన్సేషన్ ఆర్ ఆర్ ఆర్ మూవీ(RRR Movie)తో ఎన్టీఆర్, రామ్ చరణ్ భారీ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. దేశవ్యాప్తంగా ఎన్టీఆర్(NTR), రామ్ చరణ్ పేరు ప్రేక్షకుల్లో రిజిస్టర్ అయింది. ఈ క్రమంలో ఈ ఇద్దరు హీరోలు టాలీవుడ్ టాప్ స్టార్స్ ని వెనక్కి నెట్టారు. గతంలో మహేష్ అల్లు అర్జున్ టాప్ పొజిషన్స్ కోసం పోటీపడేవారు. అనూహ్యంగా ఎన్టీఆర్ రేసులో ముందుకొచ్చారు. 

ప్రముఖ సర్వే సంస్థ ఆర్మాక్స్ నిర్వహించిన లేటెస్ట్ సర్వేలో టాలీవుడ్ నుండి ఎన్టీఆర్ టాప్ ప్లేస్ సొంతం చేసుకున్నాడు. ఏప్రిల్ 2022 సర్వే ప్రకారం ఎన్టీఆర్ ప్రథమ స్థానం ఆక్రమించాడు. గతంలో ఎన్టీఆర్ ప్లేస్ టాప్ 4గా ఉండేది. ఇక టాప్ ఫైవ్ లో లేని రామ్ చరణ్ ఈసారి టాప్ 4 ప్లేస్ దక్కించుకున్నారు. మహేష్ అనూహ్యంగా టాప్ 5కి పడిపోవడం విశేషం. రాధే శ్యామ్ వైఫల్యం తర్వాత కూడా ప్రభాస్ 2వ స్థానం సొంతం చేసుకున్నారు. ఎన్టీఆర్ తర్వాత ప్రభాస్ అత్యధిక పాపులారిటీ కలిగిన హీరోగా ఉన్నారు. 

ఇక టాప్ 3 పొజిషన్ అల్లు అర్జున్ దక్కించుకున్నారు. టాప్ ఫైవ్ లో వరుసగా ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్ ఉన్నారు. గతంలో టాప్ 5లో ఉన్న పవన్ కళ్యాణ్ 6వ స్థానానికి పడిపోయారు. నాని, విజయ్ దేవరకొండ, చిరంజీవి, రవితేజ తర్వాత స్థానాలు వరుసగా సొంతం చేసుకున్నారు. నాలుగేళ్లుగా ఒక్క సినిమా కూడా విడుదల చేయని ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ మూవీతో తన పాపులారిటీ అమాంతం పెంచేసుకున్నారు. ఇక హీరోయిన్స్ విషయంలో సమంత, కాజల్, అనుష్క, పూజా హెగ్డే, రష్మిక మందాన టాప్ 5 పొజిషన్స్ లో ఉన్నారు. 

కాగా ఆర్ ఆర్ ఆర్ తాజాగా 50 రోజులు పూర్తి చేసుకుంది. రెండు రాష్ట్రాల్లో చాలా సెంటర్స్ లో ఆర్ ఆర్ ఆర్ డైరెక్ట్ గా 50రోజుల ప్రదర్శించడం జరిగింది. మరోవైపు యూఎస్ లో ఆర్ ఆర్ ఆర్ అన్ కట్ వర్షన్ ని వంద థియేటర్స్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మొత్తంగా ఆర్ ఆర్ ఆర్ మూవీ రామ్ చరణ్, ఎన్టీఆర్ ల స్టార్డం మరో లెవెల్ కి తీసుకెళ్లింది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు