‘ఆదిపురుష్’ సెకండ్ సింగిల్ కోసం భారీ ఏర్పాట్లు.. ఇండియన్ సినిమాలోనే మొదటిసారిగా.. ఏం చేస్తున్నారంటే?

By Asianet News  |  First Published May 25, 2023, 10:19 AM IST

‘ఆదిపురుష్’ చిత్రాన్ని భారీ స్థాయిలో ప్రమోట్ చేసేందుకు మేకర్స్ సిద్ధం అయ్యారు. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు షురూ కాగా.. రెండో పాట విడుదల నుంచి మరింత జోరు పెంచనున్నారు. ప్లానింగ్స్  ఆసక్తికరంగా ఉన్నాయి. 
 


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (PRabhas)  - కృతి సనన్ జంటగా నటించిన హిందూ మైథలాజికల్ ఫిల్మ్ ‘ఆదిపురుష్‌’.  ఓం రౌత్ డైరెక్టర్. టీసిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ నిర్మించారు.  చిత్రం జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. ఇప్పటికే టికెట్ యూఎస్ఏ లోని ప్రీమియర్స్ కు సంబంధించిన అడ్వాన్డ్స్ బుకింగ్స్ కూడా షురూ అయ్యాయి. నెల ముందు వదిలిన చిత్ర ట్రైలర్ తర్వాత సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. 

ప్రస్తుతం ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహించేందుకు యూనిట్ సిద్ధమైంది. ఇప్పటి వరకు అందిన ప్రతి అప్డేట్ కు సినిమాపై భారీ అంచనాలు ఏర్పడుతూ వస్తున్నాయి. రీసెంట్ గా చిత్రం మొదటి పాటను కూడా విడుదల చేశఆరు. డివోషనల్ సాంగ్స్ చేయడంలో ది బెస్ట్ అనిపించుకున్న అజయ్ - అతుల్ స్వరపరిచిన, ప్రముఖ లిరిసిస్ట్ రామ జోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన  ‘జై శ్రీరామ్ జై శ్రీరామ్ రాజా రామ్‘  సాంగ్ సంగీత ప్రియులను ఆకట్టుకుంది. ఈక్రమంలో ప్రస్తుతం రెండో పాటను విడుదల చేసేందుకు సిద్దం అవుతున్నారు. 

Latest Videos

ఆదిపురుష్ నుంచి రెండో పాటగా ‘రామ్ సియా రామ్’ అనే సాంగ్ రాబోతోంది. మే 29 మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కాబోతోంది. అయితే సెకండ్ సింగిల్ విడుదల విషయంలో యూనిట్ భారీ ఏర్పాట్లను చేసింది. దేశ వ్యాప్తంగా ‘ఆదిపురుష్’ పేరు మారుమోగేలా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఇంతకీ ఏం చేయబోతున్నారంటే.. భారత చలనచిత్ర పరిశ్రమలో మొదటిసారిగా ఈ పాట అన్నీ ప్లాట్‌ఫారమ్‌లలో భారీ రోడ్‌బ్లాక్‌ను చేయబోతోంది. ఇందుకోసం సినిమా ఛానెళ్లు, GECతో పాటు 70కిపైగా మార్కెట్‌లలోని రేడియో స్టేషన్‌లు, నేషనల్ న్యూస్ ఛానెల్‌లు, అవుట్‌డోర్, యూట్యూబ్, మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, టిక్కెట్ బుకింగ్ ప్లాట్‌ఫారమ్‌లు మరియు మూవీ థియేటర్‌లతో ఈ పాటను ప్రదర్శించేందుకు మేకర్స్  ప్లాన్ చేశారు. 

దీంతో ఆదిపురుష్ కు మరింత హైప్ రానుంది. ఇప్పటికే విజువల్స్, గ్రాఫిక్స్, మ్యూజిక్ పరంగా అదరగొట్టారు. ఇక ఈ పాట హిందీ, తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళంలో విడుదల కానుంది. చిత్రంలో Prabhas రాముడిగా కనిపించనుండగా, Kriti Sanon కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణుడిగా కనిపించనున్నారు. లక్ష్మణ్‌గా సన్నీ సింగ్ అలరించబోతున్నారు. ఇక ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జూన్ 6న తిరుపతిలో గ్రాండ్ గా నిర్వహించేందుకు  భారీ స్థాయిలో ఏర్పాట్లు చేయనున్నారు. 


 

click me!