
చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించింది లవ్ టుడే. ఈ చిత్ర బడ్జెట్ జస్ట్ రూ. 5 కోట్లని సమాచారం. ఏకంగా రూ. 100 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. యంగ్ డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వం వహించి నటించారు. కాంటెంపరరీ సబ్జెక్టు ఎంచుకొని ఎంటర్టైనింగ్ గా తెరకెక్కించిన సక్సెస్ అయ్యాడు. ఈ మూవీ తెలుగులో విడుదల చేయగా మంచి విజయమే సాధించింది.
ఈ సెన్సేషనల్ మూవీని హిందీలో రీమేక్ చేయనున్నారు. అందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. లవ్ టుడే రీమేక్ లో స్టార్ కిడ్స్ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా నటిస్తాడట. ఇక హీరోయిన్ గా శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్ నటిస్తుందట. దీనిపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ బాలీవుడ్ లో ప్రముఖంగా వినిపిస్తోంది.
శ్రీదేవికి ఇద్దరు కుమార్తెలు కాగా... పెద్దమ్మాయి జాన్వీ కపూర్ ఆల్రెడీ హీరోయిన్ గా రాణిస్తుంది. దేవర మూవీలో ఎన్టీఆర్ కి జంటగా నటిస్తుంది. దేవర ఆమె ఫస్ట్ సౌత్ ఇండియన్ మూవీ. త్వరలో ఖుషి కపూర్ కూడా వెండితెరకు పరిచయం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక అమిర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ ఎంట్రీ ఇస్తున్నారట. కాగా అమిర్ ఖాన్ సినిమాల నుండి షార్ట్ బ్రేక్ తీసుకున్న విషయం తెలిసిందే.