ఆరేళ్ల తర్వాత ‘ఉయ్యాల జంపాల’ డైరెక్టర్ కొత్త సినిమా ప్రారంభం.. ఇంట్రెస్టింగ్ డిటేయిల్స్

By Asianet News  |  First Published May 24, 2023, 9:35 PM IST

టాలీవుడ్ డైరెక్టర్ విరించి వర్మ మళ్లీ వరుస చిత్రాలతో యాక్టివ్ అవుతున్నారు. తాజాగా ఆయన దర్శకత్వంలో రాబోతోతున్న కొత్త సినిమా ప్రారంభం అయ్యింది. డిటేయిల్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. 
 


టాలీవుడ్ డైరెక్టర్ విరించి వర్మ (Virinchi Varma) తొలిచిత్రం ‘ఉయ్యాల జంపాల’. రాజ్ తరుణ్ - అవికాగో ర్ జంటగా 2013లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి సక్సెస్ ను కూడా అందుకుంది. ఆ తర్వాత చాలా గ్యాప్ ఇచ్చి అక్కినేని యంగ్ హీరో అఖిల్ హీరోగా ‘మజ్ను’ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రం 2016లో వచ్చింది. ఈ మూవీ విరించికి ఆశించిన మేర ఫలితాన్నివ్వలేకపోయింది. దీంతో ఆరేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. 

చాలా కాలం తర్వాత మళ్లీ ఇప్పుడిప్పుడే దర్శకుడు విరించి వరుస చిత్రాలతో యాక్టివ్ అవుతున్నారు. తాజాగా తన కొత్త చిత్రాన్ని ప్రారంభించారు. నూతన నటీనటులతో ఒక సినిమాను షురూ చేశారు. ముదుగంటి క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1 గా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది.

Latest Videos

1980 లో జరిగే ఒక పిరియడిక్ కథగా రూపొందుతున్న ఈ సినిమా తెలంగాణా నేపథ్యంలో రియల్ ఇంసిడెన్స్ ను బేస్ చేసుకొని నడిచే కథగా ఈ చిత్రం ఉండబోతోంది. ప్రముఖ సినిమాటోగ్రఫర్ వి.ఎస్.జ్ఞానశేఖర్ ఈ సినిమాకు కెమెరామెన్ గా వర్క్ చేస్తున్నారు. అలాగే గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు. నాగేంద్ర కుమార్ ఈ సినిమాకు ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. 

డైరెక్టర్ విరించి వర్మ తన గత రెండు చిత్రాలతో లవ్ స్టోరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సారి పవర్ ఫుల్ యాక్షన్ డ్రామా తో నూతన చిత్రాన్ని తీస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఆర్టిస్టుల వివరాలు అలాగే టైటిల్, ఫస్ట్ లుక్ త్వరలోనే మీడియాకు తెలియజేయనున్నారు చిత్ర యూనిట్. ఈ చిత్రం తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ తో నూ మూవీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

click me!