వరుణ్ తేజ్ ఎఫెక్ట్.. క్రిష్ కి కోట్లలో నష్టాలు!

By Udayavani DhuliFirst Published Dec 25, 2018, 11:37 AM IST
Highlights

దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెలుగులో వేదం, గమ్యం, కంచె వంటి వైవిధ్యమైన చిత్రాలతో పాటు 'గౌతమి పుత్ర శాతకర్ణి' వంటి చారిత్రాత్మక చిత్రాలను కూడా రూపొందించాడు. 

దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెలుగులో వేదం, గమ్యం, కంచె వంటి వైవిధ్యమైన చిత్రాలతో పాటు 'గౌతమి పుత్ర శాతకర్ణి' వంటి చారిత్రాత్మక చిత్రాలను కూడా రూపొందించాడు. దర్శకుడిగా సినిమాలు చేయడమే కాదు.. 

నిర్మాణంలో భాగస్వామ్యం కూడా తీసుకుంటాడు. రీసెంట్ గా క్రిష్ తన బ్యానర్ పై 'అంతరిక్షం' సినిమాను రూపొందించాడు. వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమాను సంకల్ప్ రెడ్డి డైరెక్ట్ చేశారు. తెలుగులో ఇప్పటివరకు రాని స్పేస్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాను రూపొందించారు.

వరుణ్ తేజ్ మార్కెట్ స్థాయిని మించి దాదాపు రూ.25 కోట్ల బడ్జెట్ తో సినిమాను నిర్మించారు. చాలా ఏరియాల్లో సినిమా బిజినెస్ అనుకున్నంత స్థాయిలో జరగకపోవడంతో నిర్మాతలు సొంతంగా విడుదల చేసుకున్నారు. సినిమాపై ఉన్న నమ్మకంతో ముందుకు వెళ్లారు. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది.

సినిమా టాక్ ఏవరేజ్ అంటున్నా కానీ కలెక్షన్లు మాత్రం లేవు. ప్రపంచవ్యాప్తంగా సినిమా మొదటి వీకెండ్ లో రూ.4.5 కోట్ల షేర్ ని వసూలు చేసింది. ఫుల్ రన్ లో సినిమా పది కోట్లు రాబట్టడం కూడా కష్టమే అనిపిస్తోంది.

శాటిలైట్, డిజిటల్ రైట్స్ రూపంలో మరో ఐదు కోట్లు వచ్చినా.. సినిమాపై పెట్టిన పెట్టుబడి మాత్రం తిరిగి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. మొత్తానికి వరుణ్ తేజ్ ఎఫెక్ట్ తో క్రిష్ కి కోట్లలో నష్టాలు తప్పడం లేదు! 
 

click me!