జయలలిత బయోపిక్.. దర్శకులకు షాక్!

Published : Jan 02, 2019, 11:41 AM IST
జయలలిత బయోపిక్.. దర్శకులకు షాక్!

సారాంశం

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్రతో సినిమా తీయడానికి చాలా మంది దర్శకులు సిద్ధమయ్యారు. ఒకరు నిత్యామీనన్ ప్రధాన పాత్రలో, మరొకరు విద్యాబాలన్ తో ఇలా సినిమాలు మొదలుపెట్టేశారు.

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్రతో సినిమా తీయడానికి చాలా మంది దర్శకులు సిద్ధమయ్యారు. ఒకరు నిత్యామీనన్ ప్రధాన పాత్రలో, మరొకరు విద్యాబాలన్ తో ఇలా సినిమాలు మొదలుపెట్టేశారు.

ఒకరిపై మరొకరు పోటీగా సినిమాలను రూపొందిస్తున్నారు.ఒకేసారి విడుదల చేయాలనేది కూడా ప్లాన్. అయితే వీరందరికీ షాక్ ఇచ్చాడు దర్శకుడు గౌతమ్ మీనన్. జయలలిత బయోపిక్ ని ఓ సినిమాగా తీస్తే.. రెండున్నర గంటల్లో చెప్పేయాలి. అదే వెబ్ సిరీస్ అయితే కొన్ని ఎపిసోడ్ల వరకు ఆమె జీవిత కథను చూపించే అవకాశం ఉంటుంది.

పైగా రెడీ అయినంత వరకు ఎపిసోడ్ల కింద విడుదల చేయొచ్చు. అందుకే ఈ బయోపిక్ ని వెబ్ సిరీస్ రూపంలో విడుదల చేస్తున్నాడు. సంక్రాంతికి ట్రైలర్ కట్ చేసి వెబ్ సిరీస్ ని కూడా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. మరోపక్క బయోపిక్ మీద సినిమాలు చేస్తోన్న వారికి కనీసం ఆరేడు నెలలు పడుతుంది.

ఈలోగా గౌతమ్ మీనన్ వెబ్ సిరీస్ కూడా రిలీజ్ చేసేస్తాడు. కాబట్టి ఈ వెబ్ సిరీస్ పై క్రేజ్ ఏర్పడడం ఖాయం. ఆ ఎఫెక్ట్ రానున్న సినిమాలపై కూడా పడుతుంది. మొత్తానికి గౌతమ్ మీనన్ తన తెలివితో మేకర్లకు పెద్ద షాక్ ఇచ్చాడనే చెప్పాలి!

PREV
click me!

Recommended Stories

Kayadu Lohar: నేపాలీ నేపథ్యం, అస్సాం నుంచి మొదలైన ప్రయాణం.. కయదు లోహర్ గురించి ఈ విషయాలు తెలుసా ?
Anasuya: భర్త మరణిస్తే బొట్టు, గాజులు తీసేయాల్సిన అవసరం ఏంటి ? తీవ్ర దుమారం రేపుతున్న అనసూయ కామెంట్స్