చై-సామ్ క్రేజ్.. 'మజిలీ' బుకింగ్స్ కి పెరిగిన రేంజ్!

Published : Apr 03, 2019, 04:56 PM IST
చై-సామ్ క్రేజ్.. 'మజిలీ' బుకింగ్స్ కి పెరిగిన రేంజ్!

సారాంశం

అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా నటించిన 'మజిలీ' సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు రానుంది. 

అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా నటించిన 'మజిలీ' సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఆన్ లైన్ లో సినిమా టికెట్లు పెట్టడంతో బుకింగ్స్ ఓ రేంజ్ లో జరుగుతున్నాయి. అన్ని ఏరియాల్లో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.

పెళ్లి తరువాత చైతు, సమంత కలిసి నటిస్తోన్న సినిమా కావడం, ట్రైలర్ లో ఎమోషన్స్ లో పీక్స్ లో ఉండడంతో ఈ సినిమాకి క్రేజ్ బాగా పెరిగిపోయింది. పైగా సంక్రాంతి తరువాత బాక్సాఫీస్ వద్ద సరైన సినిమా రాకపోవడంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి తీవ్రంగా ఉండడంతో ఇలాంటి సమయంలో 'మజిలీ'ని రిలీజ్ చేయడం ఎందుకని వాయిదా వేయాలని అనుకున్నారు కానీ సినిమా మీద నమ్మకంతో ఎన్నికలకు ముందే రిలీజ్ చేస్తున్నారు.

అడ్వాన్స్ బుకింగ్స్ కి మంచి డిమాండ్ ఏర్పడడంతో ఓపెనింగ్స్ భారీగా కొల్లగొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. శివ నిర్వాన డైరెక్ట్ చేసిన ఈ సినిమాను సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మించారు. 

PREV
click me!

Recommended Stories

500 కోట్ల ధురంధర్, స్టార్ హీరోలను కూడా భయపెడుతున్న రణ్ వీర్ సింగ్ సినిమా
రవితేజ సంచలన నిర్ణయం, మాస్ మహారాజా ట్యాగ్ ను దూరం పెట్టిన స్టార్ హీరో?