ముచ్చటగా మూడో దృశ్యం సినిమాకు రెడీ అవుతన్న మేకర్స్, ఆసారి డిఫరెంట్ గా..?

Published : Aug 14, 2022, 12:32 PM ISTUpdated : Aug 14, 2022, 12:34 PM IST
ముచ్చటగా మూడో దృశ్యం సినిమాకు రెడీ అవుతన్న మేకర్స్, ఆసారి డిఫరెంట్ గా..?

సారాంశం

మలయాళంలో సూపర్ హిట్ అయ్యి తెలుగులో రీమేక్ అయిన  సినిమా దృశ్యం. ఈమూవీకి ఇప్పటికే రెండు సీక్వెల్ సినిమాలు రాగా.. ఇక మూడో సినిమాకు రెడీ అవుతున్నారు మేకర్స్. 

మాలయాళంలో మోహాన్ లాల్ హీరోగా తెరకెక్కిన  సినిమా దృశ్యం.  తెలుగులోకి అదే పేరుతో రీమేక్ అయ్యి ఇక్కడ కూడా సూపర్ హీట్ అయ్యింది  ఈ సినిమా. మలయాళంలో మోహన్‌లాల్  హీరో అయితే.. తెలుగులో విక్టరీ వెంకటేష్ హీరోగా ఈసినిమా తెరకెక్కింది. మలయాళ వెర్షన్ ను  మించి తెలుగు  రీమేక్ ను ఆధరించారు ప్రేక్షకులు. ఇక తెలుగు వెర్షన్ హిట్ అయిన తరువాత అటు హిందీలోను.. ఇటు తమిళంలోను ఈ సినిమా తెరకెక్కింది. 

ఇక దృశ్యం సినిమాకి వరుసగా సక్సెస్ అందుతుండటంతో.. ఈ సినిమాకు  సంబంధించి మూడో సినిమా త్వరలో రాబోతోంది. దృశ్యం-3 పేరుతో  సినిమాను తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. సన్నాహాలు కూడా చేస్తున్నారు.  సినిమా కోసం థ్రిల్లింగ్ కాన్సెప్ట్ లో కథ కూడా  రెడీ చేశారని తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటి వరకూ అఫీషియల్ గా ప్రకటన రాలేదు. త్వరలో  దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రాబోతున్నట్టు తెలుస్తోంది. 

ఇక రెండు పార్ట్ లలో హీరోగా సందడి చేసిన మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించ బోతున్నారు. ఈ సినిమా తరువాత తప్పకుండా తెలుగులో కూడా రీమేక్ అయ్యే అవకాశం ఉంది. ఈసినిమా రీమేక్ కోసం ఇటు వెంటకేష్ కూడా రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.  వీలయితే మలయాళ వెర్షన్‌తోపాటే తెలుగు వెర్షన్ కూడా ఒకేసారి  తెరకెక్కించాలనే సన్నాహాల్లో మేకర్స్ వున్నారని సమాచారం. అయితే ఈ విషయాలపై ఇంకా స్పస్టత రాలేదు. రావల్సి ఉంది. దృశ్యం పార్ట్ 3 కోసం మలయాళంతో పాటు తెలుగు,తమిళ, హిందీ ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Sobhan Babu రిజెక్ట్ చేసిన సినిమాతో.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన హీరో ఎవరు? ఏంటా సినిమా?
Pawan Kalyan కు అభినవ కృష్ణదేవరాయ బిరుదు, ధర్మం, రాజ్యాంగం వేరు కాదన్న పవర్ స్టార్