కెరీర్‌లో ఫస్ట్ టైమ్‌ బన్నీ ఆ సాహసం.. ఫ్యాన్స్ రిసీవ్‌ చేసుకుంటారా?

Published : Jun 25, 2021, 09:25 PM IST
కెరీర్‌లో ఫస్ట్ టైమ్‌ బన్నీ ఆ సాహసం..  ఫ్యాన్స్ రిసీవ్‌ చేసుకుంటారా?

సారాంశం

స్టార్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ ఆయనకు `ఐకాన్‌ స్టార్‌` అనే బిరుదుని ఇటీవల `పుష్ప` ఫస్ట్ గ్లింప్స్ ఈవెంట్‌లో ఇచ్చారు.  దీంతో ఇప్పుడు బన్నీ `ఐకాన్‌ స్టార్‌` అయిపోయాడు. నిజానికి బన్నీకి `ఐకాన్‌` అనే బిరుదు రెండేళ్ల క్రితమే వచ్చేది.

అల్లు అర్జున్‌.. స్టయిలీష్‌ స్టార్‌ నుంచి ఐకాన్‌ స్టార్‌గా ప్రమోట్‌ అయిన హీరో. స్టయిలీష్‌ పాత్రలే కాదు, స్టయిలీష్‌ నటనతోనూ, డ్రెస్సింగ్‌ స్టయిల్స్ తోనూ, డాన్సుతోనూ తానుస్టయిలీష్‌ యాక్టర్‌ అని నిరూపించుకున్నారు. కానీ ఇంకా ఎన్నాళ్లు స్టయిలీష్‌ స్టార్‌గా ఉండిపోతావు, ఇంకో మెట్టు ఎక్కాలని చెప్పి స్టార్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ ఆయనకు `ఐకాన్‌ స్టార్‌` అనే బిరుదుని ఇటీవల `పుష్ప` ఫస్ట్ గ్లింప్స్ ఈవెంట్‌లో ఇచ్చారు. 

దీంతో ఇప్పుడు బన్నీ `ఐకాన్‌ స్టార్‌` అయిపోయాడు. నిజానికి బన్నీకి `ఐకాన్‌` అనే బిరుదు రెండేళ్ల క్రితమే వచ్చేది. ఆయన `వకీల్‌సాబ్‌` ఫేమ్‌ వేణు శ్రీరామ్‌తో `ఐకాన్‌`(కనబడుట లేదు) అనే సినిమా చేయాల్సి ఉంది. కానీ దాన్ని పక్కన పెట్టి ఇతర సినిమాలను పట్టాలెక్కించాడు బన్నీ. సుకుమార్‌తోపాటు కొరటాలతో సినిమాని అనౌన్స్ చేశాడు. దీంతో `ఐకాన్‌` ఇక లేనట్టే అనుకున్నారు. కానీ ఇటీవల కొరటాల బన్నీకి హ్యాండిచి ఎన్టీఆర్‌తో సినిమాకి కమిట్‌ అయ్యాడు. 

దీంతో ఇప్పుడు బన్నీ మళ్లీ `ఐకాన్‌`పై ఫోకస్‌ పెట్టినట్టు తెలుస్తుంది. వేణు శ్రీరామ్‌తో సినిమాని చేసేందుకు బన్నీ ఆసక్తి చూపిస్తున్నాడని సమాచారం. అయితే ఇందులో బన్నీ గుడ్డివాడిగా కనిపిస్తాడని అంటున్నారు. టైటిల్‌ క్యాప్షన్‌ మీనింగ్‌ అదే అంటూ ప్రచారం జరుగుతుంది. ఈ మూవీలో బన్నీకి నిజంగానే కళ్లు కనిపించవట. అంధుడి పాత్రలో కనిపించనున్నట్లు ఫిల్మ్‌ నగర్‌ టాక్‌. త్వరలోనే ఐకాన్‌ మూవీకి సంబంధించి అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ రానున్నట్లు సమాచారం. గతంలో రవితేజ `రాజా ది గ్రేట్` సినిమాలో అంధుడి పాత్రలో నటించి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మరి బన్నీని అభిమానులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో చూడాలి. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు