ప్రభాస్‌-ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో పాన్‌ ఇండియా సినిమా.. రెండు రోజుల్లో ప్రకటన ?

Published : Nov 30, 2020, 01:57 PM ISTUpdated : Nov 30, 2020, 02:45 PM IST
ప్రభాస్‌-ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో పాన్‌ ఇండియా సినిమా.. రెండు రోజుల్లో ప్రకటన ?

సారాంశం

డిసెంబర్‌ 2న మధ్యాహ్నం రెండు గంటల తొమ్మిది నిమిషాలకు మరో ఇండియన్‌ సినిమాని ప్రకటించబోతున్నట్టు హోంబలే ఫిల్మ్స్ ప్రకటించింది. అయితే దీనికి ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తారని, ప్రభాస్ హీరోగా ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. 

`కేజీఎఫ్‌` చిత్రంతో కన్నడ చిత్ర పరిశ్రమకి కొత్త ఊపుతీసుకొచ్చిన దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌. రీమేక్‌ సినిమాలకు కేరాఫ్‌ అనే కన్నడ చిత్ర పరిశ్రమపై ఉన్న మచ్చని పటాపంచలు చేస్తూ దేశ వ్యాప్తంగా శాండల్‌వుడ్‌ సత్తా ఏంటో చాటారు. ప్రస్తుతం `కేజీఎఫ్‌ఃఛాప్టర్‌ 2` తెరకెక్కిస్తున్నారు ప్రశాంత్‌ నీల్‌. ఈ సినిమాని హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తోంది. ఇదిలా ఉంటే ఈ ప్రొడక్షన్‌ నుంచి మరో జాతీయ స్థాయి సినిమా రాబోతుంది. 

డిసెంబర్‌ 2న మధ్యాహ్నం రెండు గంటల తొమ్మిది నిమిషాలకు మరో ఇండియన్‌ సినిమాని ప్రకటించబోతున్నట్టు హోంబలే ఫిల్మ్స్ ప్రకటించింది. అయితే దీనికి ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తారని, ప్రభాస్ హీరోగా ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ ఓ సినిమా చేయబోతున్నట్టు ఆ మధ్య వార్తలొచ్చాయి. కానీ వాటికి బ్రేక్‌ చెబుతూ, ప్రభాస్‌ వరుసగా నాగ్‌ అశ్విన్‌ డైరెక్షన్‌ ఓ సినిమా, అలాగే బాలీవుడ్‌ డైరెక్టర్‌ ఓం రౌత్‌ దర్శకత్వంలో `ఆదిపురుష్‌` చిత్రాలు చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారు. వచ్చే ఏడాది ఇవి ప్రారంభం కానున్నాయి.

మరి ఈ నేపథ్యంలో ప్రశాంత్‌ నీల్‌తో సినిమా రావడానికి మరో రెండేళ్ళు పడుతుందనే టాక్‌ వినిపించింది. అయితే తాజాగా హోంబలే ఫిల్మ్స్ ప్రకటించబోయే సినిమా ప్రభాస్‌-ప్రశాంత్‌ నీల్‌ ల కాంబినేషన్‌లోనే ఉంటుందా? లేక మరో కొత్త కాంబినేషన్‌లో సినిమాని ప్రకటిస్తారా? అన్నది ఆసక్తి నెలకొంది. కానీ వీరి కాంబినేషన్‌లోనే సినిమా ప్రకటన ఉండబోతుందనే వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఇదిలా ఉంటే ఎన్టీఆర్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ ఓ సినిమా అనుకున్న విషయం తెలిసిందే. మరి దీనికి సంబంధించిన ప్రకటన వెలువరించనున్నారా? అన్నది మరింత ఆసక్తికరంగా మారింది. మరి దీని విషయంలో క్లారిటీ రావాలంటే మరో రెండు రోజులు వెయింట్‌ చేయాల్సిందే.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Kalyan Padala Remuneration: కళ్యాణ్ పడాల పారితోషికం, ప్రైజ్ మనీ ఎంత? విజేతకు అందే కళ్లు చెదిరే బహుమతులు ఏవో తెలుసా?
Sanjjanaa Galrani: తన హీరోయిన్ సంజనకే ఝలక్ ఇచ్చిన శ్రీకాంత్.. ఎలా ఎలిమినేట్ చేశాడో తెలుసా ?