
నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన వందోచిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి విజయవంతం అవ్వాలని కోరుతూ గ్రేటర్ విశాఖ తెలుగు యువత రఆధ్వర్యంలో ఆర్.కెతబీచ్ లోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో హోమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో గ్రేటర్ విశాఖ తెలుగు యువత అధ్యక్షుడు లొడగల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. బాలకృష్ణ నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రం... భారత దేశాన్ని మొత్తాన్ని పాలించిన ఏకైక తెలుగు చక్రవర్తి శాతకర్ణి పై కావడంతో తెలుగు ప్రేక్షకులంతా ఈ చిత్రాన్ని ఆదరిస్తారని నమ్మకంతోనే... మరింత ఆశీసులు కోరుతూ హోమన నిర్వహించామని నిర్వాహకులు అన్నారు.
ఈ హోమం మాత్రమే కాక గౌతమిపుత్ర శాతకర్ణి విజయవంతం అవ్వాలని కోరుతూ ఇప్పటికే ఎన్బీకే హెల్పింగ్ హ్యాండ్స్ బాలయ్య అభిమానుల నేతృత్వంలో శత పుణ్య ఖేత్ర జైత్రయాత్ర చేయడమే కాక... హీరో బాలకృష్ణ , దర్శకుడు క్రిష్ కూడా స్వయంగా కోటిలింగాలలో పూజలు నిర్వహించారు.