రణ్ వీర్ సింగ్ కు అరుదైన గౌరవం, ఆహీరోల సరసన బాలీవుడ్ స్టార్..

Published : Dec 20, 2023, 10:01 AM IST
రణ్ వీర్ సింగ్ కు అరుదైన గౌరవం, ఆహీరోల సరసన బాలీవుడ్ స్టార్..

సారాంశం

బాలీవుడ్ స్టార్  హీరో రణ్‌వీర్ సింగ్‌కి అరుదైన గౌరవం లభించింది. అమితాబ్, షారుఖ్, సల్మాన్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల తరువాత రణ్ వీర్ సింగ్ ఈ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. 

బాలీవుడ్ లో తరదైన మార్క్ హీరోయిజం చూపిస్తుంటాడు  రణ్‌వీర్ సింగ్‌. ఆయన  ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అంతే ఉంటుంది. చాలా డిఫరెంట్ యాటీడ్యూడ్ తో .. చిన్న పెద్ద అందరితో కలిసి పోయి.. స్థాయిలను బట్టి కాకుండా మనుషులను సమానంగా ట్రీట్ చేస్తుంటాడు. ఒక్క ఇండియాలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా రణ్‌వీర్‌కి అభిమానులు ఉన్నారు. తాజాగా రణ్‌వీర్ సింగ్‌కి అరుదైన గౌరవం దక్కింది. 

ఇప్పటికే ఇండియాకు చెందిన సినీరాజకీయక్రీడా ప్రముఖులు పలువురి మైనపు విగ్రహాలున్న లండన్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియమ్‌లో రణ్‌వీర్ సింగ్ మైనపు విగ్రహం కూడా చేరింది. అది కూడా ఒక్కటి కాదు ఏకంగా రెండు మైనపు విగ్రహాలను వారు ఏర్పాటు చేశారు. ఇక  ఈ విషయాన్ని రణ్‌వీర్ సింగ్ సోషల్ మీడియాలో ఆనందంగా శేర్ చేశారు. 

సోషల్ మీడియాలో రణ్‌వీర్ సింగ్ పోస్ట్ వైరల్ అవుతోంది. మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియమ్‌లో ఉన్న తన రెండు మైనపు బొమ్మల సరసన రణ్ వీర్ నిలుచుని ఫోటోలకు ఫోజు ఇచ్చారు.  చిత్రం ఏంటంటే.. ఈ ఫోటోలో ఎవరు ఓరిజినల్ రణ్ వీర్ అనేది మాత్రం కనిపెట్టలేనంత ఓరిజినల్ గా ఈ విగ్రహాలను తయారుచేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ విషయంలో సోషల్ మీడియాలో జనాలకు ప్రశ్నలు కూడా వేస్తున్నారు.. ఎవరు ఓరిజినల్ రణ్ వీర్.. కనిపెట్టడండి చూద్దాం అంటూ ప్రశ్నలు వేస్తున్నారు. 

 

ఈ ఫోటోలో ఉన్న అసలు రణ్‌వీర్ ఎవరు? కనిపెట్టాలంటూ..  సోషల్ మీడియాలో ఈ పిక్ ను శేర్ చేస్తూ.. వైరల్ చేస్తున్నారు. అయితే ఇందులో.. పింక్ జాకెట్ ధరించి, బ్లాక్ ప్రింటెండ్ కోటు, కళ్లకు గాగుల్స్‌తో ముగ్గురు రణ్‌వీర్‌లు ఉన్నట్లు ఫోటో కనిపించింది. వీరిలో కళ్లకు గాగుల్స్‌తో కనిపిస్తున్నది నిజమైన రణ్‌వీర్ .. అటూ ఇటూ ఉన్నవి మైనపు బొమ్మలు. ఇక ఈ ఫోటో చూసాక నెటిజన్లు రణ్‌వీర్ సింగ్ కు భారీ ఎత్తున విషెష్ చెపుతున్నారు. 

ఇప్పటికే మన దేశం నుంచి ఎంతో మంది స్టార్స్ మైనపు విగ్రహాలు అక్కడ ఏర్పాటు చేశారు. అమితాబ్, మహేష్ బాబు, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అల్లు అర్జున్,  ప్రభాస్, సచిన్, థోనీ లాంటి స్టార్స్ విగ్రహాలు అక్కడ ఏర్పాటు చేశారు. ఇక తాజాగా రణ్ వీర్ సింగ్ కూడా ఈ లిస్ట్ లో చేరారు. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

BMW Teaser: 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ రివ్యూ.. వరుస డిజాస్టర్లతో రూటు మార్చిన రవితేజ, రొమాన్స్ షురూ
Missterious Review: 'మిస్‌టీరియస్' మూవీ రివ్యూ.. ట్రైయాంగిల్ లవ్ స్టోరీలో మిస్టరీ ఆకట్టుకుందా, తేలిపోయిందా ?