Bigg Boss Telugu 6: అమ్మ కోరిక మేరకు లుక్ మార్చేసిన రేవంత్... భార్య విషయంలో పాపం నిరాశ!

Published : Nov 25, 2022, 12:56 PM IST
Bigg Boss Telugu 6: అమ్మ కోరిక మేరకు లుక్ మార్చేసిన రేవంత్... భార్య విషయంలో పాపం నిరాశ!

సారాంశం

బిగ్ బాస్ హౌస్లో ఫ్యామిలీ వీక్ నడుస్తుంది. కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిగా హౌస్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. సింగర్ రేవంత్ కోసం వాళ్ళ అమ్మగారు వచ్చారు.   

మూడు నెలలుగా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కుటుంబానికి దూరంగా బ్రతుకుతున్నారు. అమ్మానాన్నలతో పాటు కుటుంబ సభ్యులను, సన్నిహితులను కలవాలని కంటెస్టెంట్స్ ఎంతగానో కోరుకుంటున్నారు. వారి ఎమోషన్స్ ని క్యాష్ చేసుకునేందుకు బిగ్ బాస్ ఫ్యామిలీ వీక్ ప్లాన్ చేశారు. కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్లోకి ఒక్కొక్కరుగా వస్తున్నారు. 

తాజాగా  రేవంత్ తల్లిగారు ఆయన కోసం బిగ్ బాస్ హౌస్లో కాలు పెట్టారు. ఆమె కంటెస్టెంట్స్ అందరినీ చాలా బాగా పలకరించారు. బాగా కలిసిపోయారు. శ్రీహాన్, కీర్తిలను ప్రత్యేకంగా పలకరించారు. కీర్తిని కూతురుతో సమానంగా. ఎప్పుడైనా మా ఇంటికి రావచ్చని చెప్పింది. ఇక కొడుకు రేవంత్ తో ఆప్యాయంగా మాట్లాడారు. కోపం తగ్గించుకో అని సలహా ఇచ్చారు. రేవంత్ భార్య గర్భవతిగా ఉన్న క్రమంలో అతడు గడ్డం పెంచుతున్నాడు. 

బాగా పెరిగిన గడ్డంలో రేవంత్ తల్లి అతడిని చూడలేకపోయింది. కొంచెం గడ్డం కట్ చేసుకోమని చెప్పింది. దాంతో రేవంత్ నీట్ షేవ్ చేసుకొని వచ్చాడు. మీసం మాత్రం ఆర్ ఆర్ ఆర్ మూవీలో రామ్ చరణ్ మాదిరి తిప్పాడు. తల్లి కోసం రేవంత్ తన లుక్ పూర్తిగా మార్చేశాడు. రేవంత్ కి బిగ్ బాస్ డబుల్ ధమాకా ఇచ్చాడు. భార్యతో వీడియో కాల్ మాట్లాడే అవకాశం ఇచ్చాడు. అయితే పూర్తిగా మాట్లాడకుండానే కాల్ కట్ అయ్యింది. దానికి రేవంత్ నిరాశ చెందాడు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: కళ్యాణ్ ని తనూజ నిజంగా లవ్ చేస్తోందా ? సంతోషం పట్టలేక మ్యాటర్ బయటపెట్టేసిందిగా
భార్యతో విడాకుల రూమర్స్ ? స్టార్ డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్ వైరల్