Bigg Boss Telugu 6: బిగ్ బాస్ ఓటింగ్... ఎవరు టాప్?ఎవరు బాటమ్?

Published : Nov 29, 2022, 11:23 AM ISTUpdated : Nov 29, 2022, 11:55 AM IST
Bigg Boss Telugu 6: బిగ్ బాస్ ఓటింగ్... ఎవరు టాప్?ఎవరు బాటమ్?

సారాంశం

13వ వారానికి ఆరుగురు నామినేషన్స్ లో ఉన్నారు. సోమవారం నుండి ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి. ఈ వారం హౌస్ వీడేది ఎవరనే ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుత ఓటింగ్ ప్రకారం ఎవరు ఏ స్థానాల్లో ఉన్నారన్న విషయం లీకైంది.   


మరో మూడు వారాల్లో బిగ్ బాస్ సీజన్ 6 ముగియనుంది. ఇంట్లో 8 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో ఐదుగురు ఫైనల్ కి ముగ్గురు ఇంటికి వెళతారు. ఇక 13వ వారానికి ఆరుగురు సభ్యులు నామినేట్ అయ్యారు. ఇనయా కెప్టెన్ కావడంతో ఆమెకు మినహాయింపు లభించింది. శ్రీహాన్ ని ఎవరూ నామినేట్ చేయలేదు. ఇక శ్రీసత్య, ఫైమా, రోహిత్, రేవంత్, ఆదిరెడ్డి, కీర్తి ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు. 


ఈ ఆరుగురిలో ఒకరు వచ్చే వారం హౌస్ వీడనున్నారు. ప్రేక్షకుల నుండి అందరికంటే తక్కువ ఓట్లు తెచ్చుకున్న కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతారన్న విషయం తెలిసిందే. తాజా ట్రెండ్ ప్రకారం రేవంత్ టాప్ లో కొనసాగుతున్నారు. అనూహ్యంగా రెండో స్థానంలో రోహిత్ కొనసాగుతున్నారట. ఇక కీర్తి మూడో స్థానంలో, ఆదిరెడ్డి నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు. ఫైమాకు ఐదవ స్థానంలో కొనసాగుతుండగా, చివర్లో శ్రీసత్య ఉన్నారట. 

కాబట్టి ఇదే ట్రెండ్ కొనసాగితే శ్రీసత్య హౌస్ నుండి ఎలిమినేట్ కానుంది. ఇంకా చాలా రోజుల సమయం ఉంది కాబట్టి ఓటింగ్ అటూ ఇటూ కావచ్చు. ఏది ఏమైనా శ్రీసత్య, ఫైమాలలో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాగా అందరినీ షాక్ చేస్తూ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది, అంటున్నారు. అది నిర్ణయించేది కెప్టెన్ ఇనయా అంటున్నారు. ఈ క్రమంలో షోలో ఎలాంటి పరిణామం చోటు చేసుకోనుంది? ఇనయా నిర్ణయానికి బలయ్యేది ఎవరు? అనే ఉత్కంఠ కొనసాగుతోంది. 

ఇక 12వ వారం మోడల్ రాజశేఖర్ ఎలిమినేట్ అయ్యాడు. రాజ్ ఎలిమినేషన్ కొంత విమర్శలపాలైంది. నిబంధనలకు విరుద్ధంగా, లాజిక్ లేకుండా రాజ్ ని ఎలిమినేట్ చేశారన్న వాదన వినిపిస్తోంది. ఫైమా కంటే ఎక్కువ ఓట్లు వచ్చిన రాజ్ ని ఎలిమినేట్ చేయాల్సింది కాదు.గతంలో ఎవిక్షన్ పాస్ విషయంలో చోటు చేసుకున్న ఎలిమినేషన్స్ ప్రకారమైతే ఫైమా, రాజ్ ఇద్దరూ సేవ్ కావాలి అంటున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 10: రోహిత్ ను మరోసారి టార్గెట్ చేసిన టీమ్, ఇచ్చిపడేసిన నాగార్జున, అసలేం జరుగుతోంది
Charan Eliminate: బిగ్ బాస్‌ తెలుగు 10 ఐదో వారం డబుల్‌ ఎలిమినేషన్‌.. చరణ్‌ ఎలిమినేట్‌