అనుపమ పరమేశ్వరన్ కి బిగ్ షాక్... డీజే టిల్లు సీక్వెల్ నుండి అవుట్!

Published : Nov 29, 2022, 06:54 AM ISTUpdated : Nov 29, 2022, 09:15 AM IST
అనుపమ పరమేశ్వరన్ కి బిగ్ షాక్... డీజే టిల్లు సీక్వెల్ నుండి అవుట్!

సారాంశం

మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ క్రేజీ ఆఫర్ కోల్పోయినట్లు తెలుస్తుంది. సిద్ధు హీరోగా తెరకెక్కుతున్న డీజే టిల్లు స్క్వేర్ నుండి ఆమెను తప్పించినట్లు వార్తలు వస్తున్నాయి.   

ఈ ఏడాది విడుదలైన చిత్రాల్లో డీజే టిల్లు ఒక సంచలనం. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్స్ లోకి వచ్చిన డీజే టిల్లు భారీ విజయం అందుకుంది. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ రొమాంటిక్  క్రైమ్ డ్రామా ఊహించని వసూళ్లు రాబట్టింది. హీరో సిద్ధు జొన్నలగడ్డ పెర్ఫార్మన్స్ అవుట్ స్టాండింగ్ అని చెప్పాలి. అతడి తెలంగాణా మాండలికం, మేనరిజం, కామెడీ యూత్ కి తెగ నచ్చేశాయి. హీరోయిన్ నేహా శెట్టి గ్లామర్, నటన అబ్బురపరిచాయి. 

విమల్ కృష్ణ దర్శకత్వం వహించాడు. సిద్ధు, విమల్ కృష్ణ రచయితలుగా వ్యవహరించారు. భారీ సక్సెస్ సాధించిన నేపథ్యంలో దీనికి సీక్వెల్ ప్రకటించారు. డీజే స్క్వేర్ గా టైటిల్ నిర్ణయించారు. టీమ్ లో కొన్ని మార్పులు చేశారు. దర్శకుడిగా విమల్ కృష్ణ స్థానంలో మాలిక్ రామ్ ని తీసుకున్నారు. ఇక హీరోయిన్ గా నేహా శెట్టికి బదులు అనుపమ పరమేశ్వరన్ ని ఎంపిక చేశారు. 

డీజే స్క్వేర్ చిత్రీకరణ కూడా జరుపుకుంటుండగా... అనుపమ పరమేశ్వరన్ ని ప్రాజెక్ట్ నుండి తప్పించారంటూ ఒక ప్రచారం మొదలైంది. దీనిపై ఇంకా అధికారిక సమాచారం లేకున్నప్పటికీ గట్టిగా వినిపిస్తోంది. టీమ్ తో ఆమెకు తలెత్తిన వివాదాలే ఇందుకు కారణం అంటున్నారు. ఇక ప్రేమమ్, శ్యామ్ సింగరాయ్ చిత్రాల్లో నటించిన మడోనా సెబాస్టియన్ ని తీసుకున్నారట. 

కాగా అనుపమ కార్తికేయ 2 మూవీతో పాన్ ఇండియా హిట్ అందుకుంది. నిఖిల్ హీరోగా దర్శకుడు చందు మొండేటి తెరకెక్కించిన ఆ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. నిఖిల్ తో అనుపమ 18 పేజెస్ టైటిల్ తో రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ చేశారు. అది విడుదలకు సిద్దమవుతుంది. 
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 10: రోహిత్ ను మరోసారి టార్గెట్ చేసిన టీమ్, ఇచ్చిపడేసిన నాగార్జున, అసలేం జరుగుతోంది
Charan Eliminate: బిగ్ బాస్‌ తెలుగు 10 ఐదో వారం డబుల్‌ ఎలిమినేషన్‌.. చరణ్‌ ఎలిమినేట్‌