‘హిట్ 2’ సెన్సార్ పూర్తి.. ఈసారి వైలెన్స్ మామూలుగా ఉండదా.. రన్ టైం ఎంతంటే!

By team teluguFirst Published Nov 26, 2022, 2:00 PM IST
Highlights

యాక్షన్ థ్రిల్లర్ ‘హిట్ 2’ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందిస్తూ సినిమాపై ఆసక్తిని పెంచుతుండగా.. తాజాగా సినిమా సెన్సార్ కార్యక్రమాలనూ పూర్తి చేసుకుంది.
 

టాలెంటెడ్ హీరో అడివి శేష్ - మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్న చిత్రం ‘హిట్ 2’. మరికొద్ది రోజుల్లో ఈ యాక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందిస్తూ సినిమాపై మేకర్స్ ఆసక్తిని పెంచుతున్నారు. నేచరల్ స్టార్ నాని (Nani) సమర్పణలో వస్తున్న క్రైమ్ థ్రిల్లర్ అండ్ యాక్షన్ ఫిల్మ్ ను యువ దర్శకుడు శైలేశ్ కొలను డైరెక్ట్ చేస్తున్నారు. మొదటి కేసు కంటే.. రెండు కేసులో మరింత వైలెన్స్ ఉంటుందని  ఇప్పటికే అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ‘హిట్ వెర్స్’నూ పరిచయం చేయడంతో  సీక్వెల్ పై మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది.

ఇక తాజాగా సినిమా సెన్సార్ కార్యక్రమాలనూ పూర్తి చేసుకుంది. వైలెన్స్ అంశాలను ఎక్కువగా ఉండటంతో బోర్డు నుంచి కంప్లీట్ ‘A’ సర్టిఫికేట్ ను సొంతం చేసుకుంది. ‘హిట్ : ఫస్ట్ కేసు’ను ఓన్లీ అడల్ట్ కంటెంట్ గానే నిర్ధారించగా.. ఈసారిగా అదే రెస్పాన్స్ వచ్చింది. కేవలం 18 ఏండ్లు పైబడిన వారు మాత్రమే చూడాలంటూ ఏ సర్టిఫికేట్  ను జారీ చేసుకుంది. ఇక ఈ క్రైమ్ థ్రిల్లర్ ఫిల్మ్ నిడివి సరిగ్గా 2 గంటలు ఉందని ప్రకటించారు. మూవీ డ్యూరేషన్ కూడా ఎక్కువగా లేకపోవడం విశేషం. 

వాల్ పోస్టర్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని నేచురల్ స్టార్  నాని (Nani) సమర్పిస్తున్నారు. నిర్మాత ప్రశాంతి త్రిపురనేని నిర్మిస్తున్నారు. హీరో అడివి శేష్ (Adivi Sesh), మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్నారు. నెక్ట్స్ లెవల్ డైరెక్షన్, థ్రిల్లింగ్ అంశాలతో ఆడియెన్స్ ను ఆకట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. డిసెంబర్ 2న గ్రాండ్ థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. బాణు చందర్, రావు రమేష్, పోసాని క్రిష్ణ మురళీ, తనికెళ్ల భరణి, కోమలీ ప్రసాద్ కీలక పాత్రలను పోషించారు. 

“A” will make you Bonkers this Dec 2nd
- https://t.co/5tL6mceNO8 pic.twitter.com/OTPbpJsTqE

— Adivi Sesh (@AdiviSesh)
click me!