విలక్షణ నటుడిపై మొదలైన కక్ష సాధింపు..ట్వీట్స్ ఎఫెక్ట్

Published : Mar 16, 2017, 10:06 AM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
విలక్షణ నటుడిపై మొదలైన కక్ష సాధింపు..ట్వీట్స్ ఎఫెక్ట్

సారాంశం

కమల్ హాసన్ పై పోలీసులకు ఫిర్యాదు మహాభారతాన్ని అవమానపరిచారని పేర్కొన్న హిందూ మక్కల్ కచ్చి కమల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్

మహాభారత పురాణాన్ని విలక్షణ నటుడు కమల హాసన్ అవమానపరిచారంటూ కనల హాసన్ పై హిందూ మక్కల్ కచ్చి అనే సంస్థ ఫిర్యాదు చేసింది. హిందూ మక్కల్ కచ్చి తమిళనాడు కార్యదర్శి వీర మాణిక్యం నేరుగా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసి కమల్ పై తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.

 

సదరు పార్టీ ఫిర్యాదులో తమిళులు, హిందువులకు సంబంధించిన అనేక వాస్తవాలను కావాలనే వక్రీకరించి సినిమాల్లో చూపిస్తున్నారని హిందూ మక్కల్ కచ్చి పేర్కొంది. ముఖ్యంగా కమల్ హాసన్ హిందువుల పవిత్రంగా భావించే పురాణమైన మహాభారతాన్ని కించపరిచారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

 

ఇదిలా ఉంటే కమల్ హాసన్ ఇటీవల జయలలిత మరణం అనంతరం చేసిన ట్వీట్ల ఫలితంగానే పోలీసు కేసుల వేధింపులు అని తమిళనాట చర్చ జరుగుతోంది. జయ మృతితో జరిగిన తమిళ రాజకీయ పరిణామాల్లో కమల్ తనవంతుగా శశికళకు వ్యతిరేకంగా ట్వీట్లు చేశారు. అయితే అనూహ్యాంగా... శశి వర్గం నేత పళని స్వామి సీఎం పదవిని చేపట్టడంతో.. శశికళ ఆదేశాల మేరకే కమల్ పై ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. మరి ఇది ఎంత వరకు దారి తీస్తుందో చూడాలి.

PREV
click me!

Recommended Stories

5000 తో ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చింది, ప్రస్తుతం 5 నిమిషాలకు 3 కోట్లు వసూలు చేస్తున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
Actor Sivaji: మహిళా కమిషన్‌ దెబ్బకి దిగొచ్చిన శివాజీ.. స్త్రీ అంటే మహాశక్తితో సమానం అంటూ క్షమాపణలు