రిజల్ట్స్ ఎలా ఉన్నా రెమ్యునరేషన్ మాత్రం తగ్గేది లేదు!

First Published Feb 18, 2019, 12:07 PM IST

తెలుగు సినిమాకు అంతర్జాతీయంగా మంచి గుర్తింపు లభిస్తోంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోలు తమ హవా సాగిస్తోంది. వారసత్వ హీరోలతో పాటు బయట హీరోలు కూడా తమ నటనతో జనాలను మెప్పిస్తున్నారు. 

తెలుగు సినిమాకు అంతర్జాతీయంగా మంచి గుర్తింపు లభిస్తోంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోలు తమ హవా సాగిస్తోంది. వారసత్వ హీరోలతో పాటు బయట హీరోలు కూడా తమ నటనతో జనాలను మెప్పిస్తున్నారు. అయితే వంద కోట్లు పెట్టి సినిమా తీసేప్పుడు యాభై కోట్ల వరకు హీరోలు, దర్శకుల రెమ్యునరేషన్ కే వెళ్లిపోతుంది. సినిమాలు హిట్ అవుతున్నా.. హీరోలు, దర్శకుల రెమ్యునరేషన్ కారణంగా భారీ నష్టాలు తప్పడం లేదని అంటున్నారు విమర్శకులు. మరి మన స్టార్లు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారంటే..
undefined
మహేష్ బాబు ఒక్కో సినిమాకు రూ.18 కోట్ల వరకు తీసుకుంటారు.. బ్రహ్మోత్సవం, స్పైడర్ లాంటి డిజాస్టర్ సినిమాలు వచ్చినా.. తన పారితోషికం మాత్రం తగ్గిచుకోలేదు. హయ్యెస్ట్ రెమ్యునరేషన్ అందుకుంటున్న టాలీవుడ్ హీరోల్లో మహేష్ ఒకరు.
undefined
బాహుబలి సినిమాకు ప్రభాస్ పాతిక కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారని టాక్. తను ప్రస్తుతం సైన్ చేస్తోన్న సినిమాలకు కూడా అదే రేంజ్ లో అందుకుంటున్నారని సమాచారం.
undefined
వరుస విజయాలతో దూకుడు మీదున్న ఎన్టీఆర్ రూ.18 నుండి 20 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.
undefined
ఒకప్పుడు స్టార్ హీరోగా ఉన్న పవన్ ఇప్పుడు రాజకీయాలతో బిజీ అయిపోయారు. ఆయన కూడా ఇరవై నుండి పాతిక కోట్ల రెమ్యునరేషన్ తీసుకునేవారు.
undefined
వరుస ఫ్లాప్ సినిమాలతో కొట్టిమిట్టాడుతున్న అల్లు అర్జున్ కూడా ఒక్కో సినిమాకి రూ.14 కోట్లు తీసుకుంటున్నాడు.
undefined
రామ్ చరణ్ రెమ్యునరేషన్ మొదట్లో పది కోట్లు ఉండేది. ఇప్పుడు రూ.14 నుండి 16 కోట్లు తీసుకుంటున్నాడు.
undefined
ఎన్ని ఫ్లాప్ లు వస్తున్నా.. రవితేజ తన రెమ్యునరేషన్ మాత్రం తగ్గించుకోవడంలేదు. ఆయనతో సినిమా చేయాలంటే పది కోట్లు ఇచ్చుకోవాల్సిందే.
undefined
హీరో రానాకి బాహుబలి తరువాత క్రేజ్ బాగా పెరిగింది. ప్రస్తుతం ఆయన ఒక్కో సినిమాకి రూ.9 కోట్లు చార్జ్ చేస్తున్నాడు.
undefined
'పెళ్లిచూపులు' సినిమాకి రూ.5 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్న విజయ్ దేవరకొండ ఇప్పుడు ఒక్కో సినిమాకి పది కోట్లు తీసుకుంటున్నాడు.
undefined
కెరీర్ ఆరంభంలో మూడు కోట్ల నుండి నాలుగు కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న నాని వరుస హిట్లు రావడంతో ఇప్పుడు ఒక్కో సినిమాకి ఎనిమిది కోట్లు తీసుకుంటున్నాడు.
undefined
click me!