ఖ‌రీదైన భ‌వ‌నం కొన్న యామీ గౌతమ్.. ఎంతో తెలుసా

Published : Dec 03, 2016, 03:39 AM ISTUpdated : Mar 26, 2018, 12:02 AM IST
ఖ‌రీదైన భ‌వ‌నం కొన్న యామీ గౌతమ్.. ఎంతో తెలుసా

సారాంశం

బాలీవుడ్ లో హృతిక్ సరసన చేస్తున్న యామీ గౌతమ్ కాబిల్ మూవీలో హీరోయిన్ గా యామీ హిమాచల్లో 25 ఎకరాల విస్తీర్ణంలో భవనం కొన్న యామీ

 

గౌర‌వం సినిమాలో త‌లుక్కుమ‌న్న తార యామీ గౌత‌మ్..ప్ర‌స్తుతం ఈ భామ‌కి టాలివుడ్ లో అవ‌కాశాలు ఎక్కువ‌గా లేక‌పోవాడంతో బాలివుడ్
పై క‌న్నేసింది. బాలీవుడ్‌లో ప్ర‌ముఖ హీరో  హృతిక్‌ రోషన్‌ సరసన  'కాబిల్‌' అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో హీరో, హీరోయిన్‌ అంధులే కావడం విశేషం. ఇదో థ్రిల్లర్‌ మూవీ. టాలీవుడ్‌లో అంత సీన్‌ లేకపోయినా, బాలీవుడ్‌లో యామీ గౌతమ్‌ మంచి దూకుడు ప్రదర్శిస్తోందనడానికి 'కాబిల్‌' సినిమానే నిదర్శనం. 

ఇక, యామీ గౌతమ్‌ తాజాగా ఓ ఇంటిని కొనుగోలు చేసింది. అది కూడా, 100 ఏళ్ళ పాత భవనం. హిమాచల్‌ ప్రదేశ్‌లో ఈ భవనం వుంది. ఆమె తల్లిదండ్రులే ఈ భవనాన్ని ఫైనల్‌ చేశారట. విశేషమేంటంటే, ఈ భవనం ఏకంగా 25 ఎకరాల్లో నిర్మితమైంది. 25 ఎకరాల స్థలంలో అత్యంత అందంగా ఈ భవనం వుంటుందట. పూర్తిగా 25 ఎకరాల్లో విస్తరించి లేదుగానీ, చిన్న భవనమే అయినా, చుట్టూ విశాలమైన ఖాళీ స్థలంతో అత్యద్భుతంగా ఈ భవనం వుంటుందని యామీ గౌతమ్‌ చెబుతోంది. 25 ఎకరాల స్థలంలో పురాతన, చారిత్రక భవనం అంటే చిన్న విషయమేమీ కాదు. ఈ భవనం కోసం యామీ గౌతమ్‌ భారీగానే ఖర్చు చేసిందని బాలీవుడ్‌ సినీ జనం చెవులు కొరుక్కుంటున్నారు. అయితే, అక్కడ మరీ అంత 'రేటు' లేదనీ, చాలా చీప్‌గానే ఆ స్థలాన్ని యామీ గౌతమ్‌ కొట్టేసిందని ఆమె సన్నిహితులు చెబుతున్నారట.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా