మ‌ళ్లి సౌత్ లో అడుగుపెడుతున్న కాజోల్

Published : Dec 03, 2016, 03:10 AM ISTUpdated : Mar 26, 2018, 12:02 AM IST
మ‌ళ్లి సౌత్ లో అడుగుపెడుతున్న కాజోల్

సారాంశం

1997 తర్వాత  సౌత్ సినిమాలో న‌టించ‌డానికి సిద్ద‌మైన కాజోల్  ధనుష్ హిరోగా వ‌స్తున్న వీఐపీ -2 లో న‌టించ‌బొతున్న బాలివుడ్ బ్యూటీ ఇర‌వై ఏళ్ల కింద‌ట మెరుపు క‌ల‌లు సినిమాతో సౌత్ లో న‌టించిన కాజోల్

యాడ్ మేకర్ రాజీవ్ మీనన్ ఇరవై ఏళ్ల కిందట రూపొందించిన ‘మెరుపు కలలు’ సినిమాతో సౌత్ లో తొలిసారి మెరిసింది కాజోల్. అప్పటికి బాలీవుడ్ లో టాప్ స్టేటస్ ఉండిన ఈ హీరోయిన్ ఒక ప్రాధాన్యత ఉన్న పాత్రతో సౌత్ ను పలకరించింది. అంతకు ముందు, ఆ తర్వాత ఈమె నటించిన కొన్ని హిందీ సినిమాలు తెలుగులోకి అనువాదం అయ్యాయి. అయితే డైరెక్టుగా మాత్రం కాజోల్ సౌత్ లో నటించలేదు. ఇప్పుడు ఆసకక్తికరమైన విషయం ఏమిటంటే.. కాజోల్ ఒక సౌత్ సినిమాలో నటించబోతోందనేది. ధనుష్ హీరోగా నటించిన ‘వీఐపీ’ కి సీక్వెల్ గా వస్తున్న “వీఐపీ-2’’ లో కాజోల్ ను నటింపజేయడానికి ప్రయత్నాలు సాగుతున్నట్టు సమాచారం. రజనీకాంత్ తనయ సౌందర్య ఈ సినిమాకు దర్శకత్వం వహించనుంది. ఈ సినిమాలో అమలపాల్ తో పాటు మంజిమా మోహన్ కూడా నటించనుందని ఇది వరకే వార్తలు వచ్చాయి.  ప్రాధాన్యత ఉన్న మూడో పాత్రలో కాజోల్ ను నటింపజేయనున్నారట. ఈ సినిమా ఎలాగూ వచ్చే ఏడాదికి షెడ్యూల్ అయ్యింది కాబట్టి.. 1997 లో సౌత్ లో డైరెక్ట్ సినిమా చేసిన కాజోల్ కచ్చితంగా ఇరవై ఏళ్ల తర్వాత మరో సౌత్ సినిమాలో చేసినట్టవుతుంది. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా