
ప్రముఖ తమిళ నటి యషికా ఆనంద్ కోర్టులో సందడి చేశారు. 2021 జులై 25న యాక్సిడెంట్ ద్వారా తన స్నేహితురాలి మరణానిక కారణం అయినందుకు యషికాపై కేసు నమోదు అయ్యింది. యషికా ...ఆమె తన స్నేహితులతో కలిసి కారులో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మమల్లాపుర ఏరియాలోని సులేరికాడు వద్ద కారు బోల్తాపడింది. దీంతో కారులో ఉన్న ఆమె స్నేహితురాలు వల్లిచెట్టి భవాన్ని చనిపోయింది.
కారు స్పీడ్ గా నడపడం.. ఆ టైమ్ లో భవాని సీటు బెల్టు పెట్టుకోకపోవటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. యషికాతో పాటు మరో ఇద్దరు అబ్బాయిలు కూడా కూడా అందులో ఉన్పారు. వారు యషికా స్నేహితులుగా తెలిసింది. వారు కూడా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ ముగ్గురినీ దగ్గరిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. తలకు తీవ్ర గాయం అవ్వటంతో యషికా ఐసీయూలో చాలా రోజులు ట్రీట్మెంట్ తీసుకున్నారు.
తమిళ ఇండస్ట్రీలో ఈ యాక్సిడెంట్ తీవ్ర కలకలం సృష్టించింది. ఇక, ఈ కారు యాక్సిడెంట్‌పై కేసు నమోదు చేసి దర్యప్తు చేశారు. అయితే వారు చేసిన ఎంక్వైరీలో.. యషికా కారు నడుపుతున్నట్టు తేలడంతో..కేసులో ఆమెను ప్రత్యేకంగా విచారించారు. తాను అతి వేగంగా కారు నడిపబట్టే కారు అదుపు తప్పిందని ఆమె ఒప్పుకోవడంతో.. ఈకేసు కోర్టులో విచారణన నడుస్తూనే ఉంది. ఈ కేసుకు సంబంధించి చెంగల్పట్టు కోర్టులో ఇంకా విచారణ నడుస్తూ ఉంది.
తాజాగా జరిగిన విచారణకు యషికా హాజరయ్యారు. విచారణ కోసం చెంగల్పట్టు కోర్టుకు వెళ్లారు యషికా. యషికాను ప్రశ్నించిన కోర్టు విచారణను జులై 27కు వాయిదా వేసింది.ఇక యషికా విచారణకు వెళ్ళింది.. హాజరయిన విడియోలు ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.