
హీరోయిన్ శ్రీలీల గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హీరో మహేష్ బాబు ఆమెపై ప్రశంసలు కురిపించాడు. శ్రీలీలతో డాన్స్ చేయడం అంత సులభం కాదని తేల్చేశాడు. హీరోలకు చెమటలు పడతాయన్న అర్థంలో మాట్లాడాడు. ఇక శ్రీలీల సైతం మహేష్ బాబుని పొగడ్తలతో ముంచెత్తారు. బంగారానికి ప్రాణం పోస్తే అది మహేష్ అని ఒక్క మాటలో మహేష్ ఫ్యాన్స్ ఉబ్బితబ్బిబ్బయ్యేలా చేసింది.
కాగా గుంటూరు నగరంలో జరిగిన గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్లో శ్రీలీల ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆమె గ్లామర్ కి యూత్ ఫిదా అయ్యారు. శ్రీలీల కట్టిన చీర పలువురిని ఆకర్షించింది. దీంతో సదరు చీర ధర తెలుసుకోవాలని ప్రయత్నం చేశారు. ఈ బాటిల్ గ్రీన్ డిజైనర్ శారీ ధర అక్షరాల రూ. 1.59 లక్షలు అట. ఒక్కరోజు సంబరానికి శ్రీలీల అంత ఖర్చు చేసిందంటే మాటలు కాదు.
ఇక గుంటూరు కారం మూవీ వరల్డ్ వైడ్ జనవరి 9న విడుదల కానుంది. ఈ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకుడు. ట్రైలర్ ఆకట్టుకోగా అంచనాలు భారీగా పెరిగాయి. దాదాపు 14 ఏళ్ల అనంతరం మహేష్-త్రివిక్రమ్ కాంబోలో మూవీ వస్తుంది. మహేష్ కి జంటగా శ్రీలీల, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. రమ్యకృష్ణ మహేష్ బాబు తల్లి రోల్ చేస్తుంది. మరో కీలక రోల్ లో ప్రకాష్ రాజ్ కనిపించనున్నారు.
గుంటూరు కారం చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి బరిలో నాగార్జున, వెంకటేష్ తో పాటు తేజ సజ్జా ఉన్నారు. మరి వీరిలో విన్నర్ ఎవరవుతారో చూడాలి. మహేష్ మాత్రం గుంటూరు కారం చిత్ర విజయంపై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.