
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారం. సంక్రాంతి కానుకగా గుంటూరు కారం ఘాటు చూపించేందుకు మహేష్ బాబు జనవరి 12న థియేటర్స్ లోకి దిగిపోతున్నాడు. మంగళవారం రోజు గుంటూరులో గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ట్రైలర్ కూడా అదిరిపోవడంతో మహేష్ సినిమాకి ఉండాల్సిన హైప్ వచ్చేసింది.
జనవరి 12న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కి అంతా సిద్ధం అయింది. అయితే ప్రీమియర్ షోలు, మిడ్ నైట్ షోల అనుమతుల కోసం చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే పలు చోట్ల అనుమతులు లభించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా గుంటూరు కారం చిత్ర టికెట్ ధరల పెంపు విషయంలో కూడా ఓ క్లారిటీ వచ్చేసినట్లు ఉంది.
తాజాగా ఏపీ ప్రభుత్వం గుంటూరు కారం టికెట్ ధరని రూ. 50 వరకు పెంచుకునే అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. త్వరలో అధికారికంగా జీవో కూడా విడుదల కానున్నట్లు సమాచారం. ఇటీవల విడుదలైన ప్రభాస్ సలార్ చిత్రం కంటే ఇది ఎక్కువ మొత్తమే అని చెప్పొచ్చు. సలార్ చిత్రానికి 40 రూపాయలు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
గుంటూరు కారం పెరిగిన టికెట్ ధరలు మొదటి వారం వరకు అమలులో ఉంటాయి. ఇక తెలంగాణాలో హైదరాబాద్ లాంటి మల్టీ ఫ్లెక్స్ లలో 100 రూపాయల వరకు టికెట్ ధర పెరగనునట్లు తెలుస్తోంది. దీనితో సంక్రాంతి పండగ సీజన్ లో నిర్మాతలు రికార్డ్ ఓపెనింగ్స్ పై ద్రుష్టి పెట్టారు.
ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంది. మహేష్ బాబు మాస్ అవతార్ లో మెప్పిస్తున్నాడు. హారిక అండ్ హాసిని బ్యానర్ పై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు.