సావిత్రి బాటలో మరో నటి బయోపిక్!

Published : May 16, 2018, 03:10 PM IST
సావిత్రి బాటలో మరో నటి బయోపిక్!

సారాంశం

టాలీవుడ్ లో ఒక సినిమా హిట్ అయితే అదే ఫార్ములాను ఫాలో అవుతూ వందల కొద్దీ 

టాలీవుడ్ లో ఒక సినిమా హిట్ అయితే అదే ఫార్ములాను ఫాలో అవుతూ వందల కొద్దీ సినిమాలు తీస్తుంటారు. ప్రస్తుతం టాలీవుడ్ దర్శకనిర్మాతలు బయోపిక్ ల మీద పడ్డారు. నిజానికి 'మహానటి' సినిమా విడుదలయ్యే వరకు కూడా ఈ సినిమా ఇంత సక్సెస్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. ఇప్పుడు ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో టాలీవుడ్ లో మరో నటి బయోపిక్ కు శ్రీకారం చుట్టనున్నారు.

ఒకప్పటి స్టార్ హీరోయిన్ సౌందర్య గురించి టాలీవుడ్ లో తెలియని వారుండరు. అగ్ర హీరోలందరితో సినిమాలు చేసి బిజీ బిజీగా గడిపేది. ఆమె హఠాన్మరణం ఇండస్ట్రీను షాక్ కు గురిచేసింది. ఇప్పుడు సౌందర్య బయోపిక్ ను తెరకెక్కించాలని నిర్ణయించుకున్నాడు 'పెళ్లిచూపులు' ఫేం నిర్మాత రాజ్ కందుకూరి. కన్నడ అమ్మాయి అయిన సౌందర్య జీవితంలో చోటుచేసుకున్న ప్రతిఘట్టాన్ని తెరపై చూపించాలని అనుకుంటున్నాడు. 

నాలుగు దక్షినాది భాషల్లో ఈ సినిమాను రూపొందించనున్నారని సమాచారం. అయితే ఈ బయోపిక్ కు సౌందర్య కుటుంబ సభ్యులు అంగీకరించాలి. లేదంటే బయోపిక్ సెట్స్ పైకి వెళ్ళడం కష్టమే.. గంతంలో కూడా రాజ్ కందుకూరి తెలంగాణా ముఖ్యమంత్రి కెసీఆర్ బయోపిక్ నిర్మిస్తానని అన్నారు. కానీ ఇప్పటివరకు దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ లేదు. మరి సౌందర్య బయోపిక్ సంగతి ఏం చేస్తారో చూడాలి!
 

PREV
click me!

Recommended Stories

Aadarsha Kutumbam: వెంకటేష్‌ హౌజ్‌ నెంబర్‌ బయటపెట్టిన త్రివిక్రమ్‌.. చాలా ఆదర్శ కుటుంబం
సుమ కు బాలకృష్ణ భారీ షాక్, అఖండ 2 దెబ్బకు 14 సినిమాలు గల్లంతు..?