న్యూ ఇయర్ వెకేషన్ కు చెక్కేసిన శ్రుతి హాసన్.. ఎయిర్ పోర్ట్ లో స్టార్ బ్యూటీ సందడి.

Published : Dec 28, 2023, 08:04 AM ISTUpdated : Dec 28, 2023, 08:10 AM IST
న్యూ ఇయర్ వెకేషన్ కు చెక్కేసిన  శ్రుతి హాసన్.. ఎయిర్ పోర్ట్ లో స్టార్ బ్యూటీ సందడి.

సారాంశం

ప్రస్తుతం సలార్ సినిమా సక్సెస్ జోష్ లో ఉంది హీరోయిన్ శృతి హాసన్..ఈ ఏడాదంతా సూపర్ సక్సెస్ లతోదూసుకుపోయిందిబ్యూీ. ఇక తాజాగా న్యూ ఇయర్ ను హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవడం ఫారెన్ వెళ్లింది.   

ఈ ఏడాదంతా వరుస హిట్లతో సందడి చేసింది స్టార్ బ్యూటీ శృతీ హాసన్. ఇండియన్‌ ఫిలిం ఇండస్ట్రీలో  మల్టీ టాలెంటెడ్ గా పేరు సంపాదించుకుంది బ్యూటీ.  ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో మెరుస్తూ.. టాక్ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. ఒకప్పుడు ఐరెన్ లెగ్ అన్నారు.. ఇప్పుడు లక్కీ హీరోయిన్ గా మారిపోయింది బ్యూటీ. రీసెంట్ గా నేచురల్ స్టార్ నాని నటించిన హాయ్‌ నాన్న సినిమాలో గెస్ట్ రోల్ చేసింది శృతీ. అంతే కాదు  ఓడియమ్మా అంటూ సాగే ఓ  పార్టీ సాంగ్‌తో నెట్టింట హల్ చల్ చేస్తోంది.

ఇక  ప్రస్తుతం సలార్ సక్సెస్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తోంది.ఇక ఇన్నాళ్లు..సినిమాలు షూటింగ్స్ తో బిజీగా ఉన్న శృతి హాసన్‌ ఇక న్యూ ఇయర్ సెలబ్రేషన్‌ కురెడీ అయ్యింది. ఎంజాయ్ మూడ్ లోకి వెళ్ళిపోయింది.  ఇక శ్రుతి హాసన్ వెకేషన్ కు వెళ్ళున్న టైమ్ లో మీడియా కంటపడ్డారు. ఈ భామ వెకేషన్‌కు వెళ్లే క్రమంలో ముంబై ఎయిర్‌పోర్టులో ప్రత్యక్షమైంది. ఇంతకీ శృతిహాసన్ ఎక్కడికెళ్తుందనేది మాత్రం ఎవరికి తెలియదు. ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. 

 

టాలీవుడ్‌ యంగ్ హీరో అడివిశేష్ కు జోడీగా డిఫరెంట్ మూవీ చేస్తోంది శృతీ హాసన్.  హీరోగా షనీల్‌ డియో అనే కొత్త వ్యక్తి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ కి డెకాయిట్‌  అనే టైటిల్ ను ప్రకటించారు. ఇక రీసెంట్ గానే  మేకర్స్‌ డెకాయిట్ శృతిహాసన్‌ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ నెట్టింట చక్కర్లు కొడుతోంది. డెకాయిట్‌ టైటిల్ టీజర్‌ కూడా విడుదల చేయగా.. మాజీ ప్రేమికుల శత్రుత్వంతో నయా స్టైల్‌లో సినిమా డిఫరెంట్‌ స్టైల్‌లో సాగబోతున్నట్టు హింట్ ఇచ్చేశాడు డైరెక్టర్‌. ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌పై సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తుండగా.. ఆసియన్ సునీల్ సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 

ఇక ఈమధ్య శృతీ హాసన్ సీక్రేట్ గా పెళ్లి చేసుకుందంటూ రూమర్లు గట్టిగా వినిపించాయి. తన ప్రియుడు శాంతను హజారికాతో మూడుముళ్లు వేయించుకుందంటూ వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఈ విషయంలో ఏమాత్రం నిజం లేదంటూ ఆమె క్లారిటీ ఇచ్చినట్టుతెలుస్తోంది. ప్రస్తుతం ఆమె సినిమాలు మ్యూజిక్ ఈవెంట్స్ పైనే దృష్టి పెట్టినట్టు సమాచారం. 
 

PREV
click me!

Recommended Stories

Akhanda 2 Collections: `అఖండ 2` మూవీ రెండు రోజుల కలెక్షన్లు.. రెండో రోజు పడిపోయిన బాలయ్య సినిమా వసూళ్లు..
జూనియర్ ఎన్టీఆర్ కు ఇరిటేషన్ తెప్పించి, బీపీ పెరిగిపోయేలా చేసిన డైరెక్టర్ ఎవరో తెలుసా? తారక్ ఏం చేశాడంటే?