
Lee Sun-kyun :ఆస్కార్ అవార్డు విన్నింగ్ మూవీ 'పారాసైట్'సినిమా పారాసైట్ లో నటించిన ప్రముఖ దక్షిణ కొరియా నటుడు లీ సన్-క్యున్ (48) అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు పలు న్యూస్ ఏజెన్సీలు వెల్లడించాయి. అయితే.. అక్రమ డ్రగ్స్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఈ షాకింగ్ న్యూస్ వెలువడింది. నిజానికి నటుడు లీ మాదక ద్రవ్యాల వినియోగంపై విచారణ ఎదుర్కొంటున్నారు.
దక్షిణ కొరియా న్యూస్ ఏజెన్సీ ప్రకారం.. సౌత్ కొరియా రాజధాని సియోల్ లోని ఒక పార్క్ లో ఉన్న వాహనంలో లీ సన్-క్యూన్ అపస్మారక స్థితిలో కనిపించాడు. నటుడి అదృశ్యం గురించి లీ భార్య పోలీసులకు సమాచారం అందించింది. నటుడు ఇంట్లో సూసైడ్ నోట్‌ను ఉంచాడని, ఆ తర్వాత లీని శోధించగా కారులో శవమై కనిపించిందని చెప్పారు.
కఠినమైన మాదకద్రవ్యాల చట్టాలకు పేరుగాంచిన దక్షిణ కొరియా, మాదకద్రవ్యాలకు సంబంధించిన నేరాలకు కఠినమైన శిక్షలను విధిస్తుంది. నేరస్థులకు కనీసం ఆరు నెలల జైలు శిక్ష విధించబడుతుంది, మాదక ద్రవ్యాల వ్యాపారంలో పాల్గొన్న వారికి 14 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడుతుంది.
1975లో జన్మించిన లీ సన్-క్యూన్ ప్రఖ్యాత కొరియన్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఆర్ట్స్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2001లో లవర్స్ అనే టీవీ షో ద్వారా తెరంగేట్రం చేసిన ఆయన.. పారాసైట్ లో సంపన్నుడిగా నటించారు. సంపన్న కుటుంబంలో తండ్రిగా తన పాత్రకు అంతర్జాతీయ ప్రజాదరణ పొందారు. ఈ పాత్రతో దక్షిణ కొరియా చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేశారు.
2019లో విడుదలైన పారాసైట్ మూవీకి ఉత్తమ విదేశీ చిత్రం, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ సినిమా, బెస్ట్ స్క్రీన్ ప్లే విభాగాల్లో ఆస్కార్ పురస్కారాలను గెలుచుకుంది. అతను 2012 థ్రిల్లర్ "హెల్ప్‌లెస్", 2014 హిట్ "ఆల్ అబౌట్ మై వైఫ్" వంటి చిత్రాలలో తన శక్తివంతమైన పాత్రలతో ప్రజల హృదయాల్లో చోటు సంపాదించాడు.
Apple TV+ యొక్క ప్రారంభ కొరియన్ భాషా ఒరిజినల్ సిరీస్ "డా. బ్రెయిన్"లో లీ ప్రధాన పాత్ర పోషించారు. ఈ వెబ్ షో 2021లో ప్రదర్శించబడింది. ఆరు-ఎపిసోడ్‌ల సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ రహస్యాలను వెతికే మతోన్మాద న్యూరాలజిస్ట్ కోహ్ సె-వాన్ చుట్టూ తిరుగుతుంది. లీ సన్-క్యూన్ చివరిగా ఈ ఏడాది విడుదలైన స్లీప్ చిత్రంలో కనిపించారు. లీ మరణవార్త సౌత్ కొరియా పరిశ్రమలో విషాద ఛాయలు సృష్టించింది.అతని అభిమానులంతా షాక్‌లో ఉన్నారు. తమ మధ్య లీ ఇక లేరని నమ్మలేకపోతున్నారు.