అలనాటి కథానాయిక శోభన ఎందుకు పెళ్లి చేసుకోలేదంటే..?

Published : Oct 29, 2018, 12:17 PM ISTUpdated : Oct 29, 2018, 01:44 PM IST
అలనాటి కథానాయిక శోభన ఎందుకు పెళ్లి చేసుకోలేదంటే..?

సారాంశం

డెబ్బైలలో యూత్ కి కలలరాణి హీరోయిన్ శోభన. తన అందం, ఆహార్యంతో అభిమానులను సొంతం చేసుకుంది. మంచి డాన్సర్ కావడంతో కళ్ళతోనే  హావభావాలు పలికించేది. గ్లామర్ రోల్స్ లో కూడా పరిమితులు పెట్టుకొని నటించేది. ఇప్పటికీ ఆమె ఎంతో ఫిట్ నెస్ తో కనిపిస్తుంటారు.

ఒకప్పటి యూత్ కి కలలరాణి హీరోయిన్ శోభన. తన అందం, ఆహార్యంతో అభిమానులను సొంతం చేసుకుంది. మంచి డాన్సర్ కావడంతో కళ్ళతోనే 
హావభావాలు పలికించేది. గ్లామర్ రోల్స్ లో కూడా పరిమితులు పెట్టుకొని నటించేది.

ఇప్పటికీ ఆమె ఎంతో ఫిట్ నెస్ తో కనిపిస్తుంటారు. సినిమాలకు దూరమైన తరువాత ఆమె పూర్తిగా డాన్స్ పైనే శ్రద్ధ పెట్టింది. పలు క్లాసికల్ డాన్స్ షోలను నిర్వహిస్తూ గడుపుతోంది. ఇప్పటికీ కూడా నాలుగు గంటల పాటు అలసిపోకుండా డాన్స్ చేయగలిగే సత్తా ఆమెకుంది.

అయితే ఇప్పటివరకు ఆమె పెళ్లి మాత్రం చేసుకోలేదు. తాజాగా ఆమె వద్ద ఇదే విషయాన్ని ప్రస్తావించగా.. అది తన వ్యక్తిగత విషయమని చెప్పింది. ఆ విషయం గురించి మాట్లాడాలని కూడా అనుకోవడం లేదని వెల్లడించింది.

పెళ్లి చేసుకుంటేనే సంతోషంగా ఉంటారు.. లేదంటే ఉండరని అనుకోవడం కరెక్ట్ కాదని చెప్పింది. ఏది తప్పు, ఏది కరెక్ట్ అని చెప్పలేమని ఎందుకంటే  ఒక్కొక్కరికీ ఒక్కో పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుందని అందరి అనుభవాలు ఒకే విధంగా ఉండవని చెప్పుకొచ్చారు. 

PREV
click me!

Recommended Stories

Thanuja: కళ్యాణ్ పాడు చేసుకుంటున్నాడు, తనూజలో సడెన్ గా ఈ మార్పు దేనికోసం.. సూటిగా ప్రశ్నించిన అభిమాని
Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్