గాయపడ్డ సమంత.. ఆ ఫొటో చూసి ఖంగారు పడుతున్న ఫ్యాన్స్.. ఎలా జరిగింది?

By Asianet News  |  First Published Feb 28, 2023, 2:31 PM IST

స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇటీవలె మయోసైటిస్ అనే వ్యాధి నుంచి కాస్తా కోలుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తన నెక్ట్స్ ఫిల్మ్స్ పై ఫోకస్ పెట్టిన సామ్ తాజాగా గాయపడ్డట్టు ఓ ఫొటోను అభిమానులతో పంచుకుంది. 
 


టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ‘యశోద’ చిత్రంతో బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకుంది. ఆ చిత్రం రిలీజ్ కాకముందే సమంత మయోసైటిస్ వ్యాధి బారిన పడ్డ విషయం తెలిసిందే. మెరుగైన చికిత్స తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ప్రస్తుతమూ ఇంట్లోనూ చికిత్స పొందుతోంది. తన ఆరోగ్య రీత్యా ఓకే చెప్పిన సినిమాలు  కాస్తా ఆలస్యం అవుతూరావడంతో రీసెంట్ గా షూటింగ్ పై ఫోకస్ పెట్టింది. ఇందుకు తగిన విధంగా ప్రాక్టీస్ కూడా చేస్తోంది. కాగా, సమంత తన క్రేజీ ప్రాజెక్ట్ ‘సిటాడెల్’ (citadel India) ఇండియన్ వెర్షన్ వెబ్ సిరీస్ కోసం బాగా శ్రమిస్తున్నారు. భారీ యాక్షన్ సన్నివేశాల కోసం శిక్షణ కూడా పొందుతోంది. 

‘సిటాడెల్’ కోసం జిమ్ లో, ట్రైయినర్ తో ఎంతలా కష్టపడుతోందో ఎప్పటికప్పుడు అప్డేట్ అందిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం షూటింగ్ లోనూ పాల్గొంది. ఈక్రమంలో ఆమె పోస్ట్ చేసిన ఓ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. తన రెండు చేతులు రక్తంతో, దెబ్బలతో  ఉండటంతో అభిమానులు ఖంగారు పడుతున్నారు. అయితే చిత్ర యాక్షన్ సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్ లో భాగంగా ఇలా గాయపడినట్టు తెలుస్తోంది. 

Latest Videos

ప్రస్తుతం సామ్ షేర్ చేసిన ఫొటో నెట్టింట వైరల్ గా మారుతోంది. దీంతో సమంత త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని అభిమానులు కోరుతున్నారు. మరోవైపు సినిమా కోసం ఇంతలా హార్ట్ వర్క్ చేస్తుండటం పట్ల సమంతపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆమె డెడికేషన్ కు అభినందనలు తెలుపుతున్నారు. హాలీవుడ్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్’ను ఇండియన్ వెర్షన్ లో ప్రముఖ దర్శకులు రాజ్ మరియు డీకే తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ (Varun Dhawan), సమంత ప్రధాన ప్రాతల్లో నటిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ భారీ వ్యయంతో ఈ వెబ్ సిరీస్ ను నిర్మిస్తోంది. 

చైతూతో విడాకుల తర్వాత సమంత పూర్తిగా కేరీర్ పైనే ఫోకస్ పెట్టారు. ఇక నిన్ననే సమంత - నాగచైతన్య నటించిన ‘ఏమాయ చేసావే’ చిత్రం 13 ఏండ్లు పూర్తి చేసుకోవడం విశేషం.  ‘యశోద’తో భారీ సక్సెస్ అందుకున్న సమంత.. ప్రస్తుతం హిందూ పురాణాల్లోని ప్రేమకథ ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ‘శాకుంతలం’తో అలరించబోతోంది. సమ్మర్ లో రిలీజ్ కానుంది. అలాగే సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ సరసన ‘ఖుషీ’ చిత్రంలోనూ నటిస్తుంది.  

click me!