సమంతకు సన్ స్ట్రోక్ ఇచ్చిన రామ్ చరణ్

Published : May 18, 2017, 02:37 PM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
సమంతకు సన్ స్ట్రోక్ ఇచ్చిన రామ్ చరణ్

సారాంశం

నాగ చైతన్య కాబోయే సతీమణి సమంతకు వడదెబ్బ రామ్ చరణ్ సుకుమార్ చిత్రం కోసం ఎండలో రాజమండ్రి వద్ద షూటింగ్ ఎండ దెబ్బకు నటీనటులకు ఇబ్బందితో షూటింగ్ ప్యాకప్ చెప్పిన దర్శక నిర్మాతలు

తెలుగు సినీ కథానాయికల్లో అగ్ర హీరోయిన్, అక్కినేని వారి కాబోయే కోడలు, నాగచైతన్య ప్రియురాలు, కాబోయే సతీమణి సమంతకు రామ్ చరణ్ వల్ల వడదెబ్బ తగిలిందట. ఈ విషయాన్ని రామ్ చరణ్ సుకుమార్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ తరపున జారీ అయిన ఓ ప్రకటన ద్వారా తెలిపారు.

 

రామ్‌చరణ్‌, సమంత జంటగా సుకుమార్‌ దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఇంకా టైటిల్‌ ఖరారు చేయడని ఈ చిత్రాన్ని మైత్రిమూవీ మేకర్స్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం మొదటి షెడ్యూల్‌ పూర్తైంది. అయితే ఈ చిత్రం విశేషాలను తెలుపుతూ చిత్ర వర్గాలు గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. అధిక ఉష్ణోగ్రత కారణంగా మొదటి షెడ్యూల్‌లో సమంతకు వడదెబ్బ తగిలిందని ప్రకటనలో తెలిపారు.

 

‘మే 9 నుంచి హైదరాబాద్‌తోపాటు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో రెండో షెడ్యూల్‌ను ప్లాన్‌ చేశారు. హైదరాబాద్‌లో నాలుగు రోజుల షూటింగ్‌ చేసిన తర్వాత రాజమండ్రిలో 45 నుంచి 47 డిగ్రీల అమితమైన ఉష్ణోగ్రతల కారణంగా, మొదటి షెడ్యూల్‌లో సమంతకు వడదెబ్బ తగలడంతో... నటీనటులు, టెక్నిషియన్స్‌ను దృష్టిలో ఉంచుకుని రాజమండ్రి షెడ్యూల్‌ను నిర్మాతలు పోస్ట్‌ ఫోన్‌ చేశారు’ అని ప్రకటనలో పేర్కొన్నారు.

PREV
click me!

Recommended Stories

Age Gap: మన స్టార్ హీరోలకు వారి భార్యల మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
ఫిల్మ్ ఇండస్ట్రీలో విషాదం.. గాయని జానకి కుమారుడు కన్నుమూత, కారణం ఏంటి?