Rashmika Mandanna: దూరమైనప్పుడల్లా నా బేబీని చాలా మిస్ అవుతా!

By Sambi ReddyFirst Published Mar 20, 2023, 6:28 PM IST
Highlights


హీరోయిన్ రష్మిక మందాన అభిమానులతో ఆన్లైన్ చాట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన పలు ఆసక్తికర ప్రశ్నలకు సమాధానం చెప్పారు. 
 


నేషనల్ క్రష్ రష్మిక మందాన అభిమానులతో ముచ్చటించారు. ట్విట్టర్ వేదికగా ఆన్లైన్ చాట్ చేశారు. #RushHour  హ్యాష్ ట్యాగ్ తో ఆమెను నేరుగా ప్రశ్నలు అడగవచ్చని వెల్లడించారు. దీంతో ఫ్యాన్స్ పలు ఆసక్తికర ప్రశ్నలు ఆమె ముందుంచారు. ఓ అభిమాని రష్మిక చెల్లెలు షిమాన్ మందాన గురించి అడిగారు. షిమాన్ ఎలా ఉంది? ఇప్పుడు ఏం చదువుతుంది? ఆమెను నువ్వు మిస్ అవుతున్నావా? అని అడిగారు. 

ఈ ప్రశ్నకు సమాధానంగా... తాను నా పక్కన లేని ప్రతి నిమిషం నేను మిస్ అవుతాను. షిమాన్ త్వరగా పెద్దదై పోతుంది. నాలుగో తరగతి చదువుతుంది. నెక్స్ట్ ఇయర్ ఐదవ తరగతిలో అడుగుపెడుతుంది. తనకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. బెస్ట్ విషెస్ చెప్పండి, అంటూ కామెంట్ చేసింది. రష్మికకు చెల్లెలు ఉందని తెలుసు కానీ మరీ నాలుగో తరగతి చదివేంత చిన్నది అనుకోలేదని నెటిజెన్స్ షాక్ అవుతున్నారు. చెల్లికి ఆమెకు చాలా ఏజ్ గ్యాప్ ఉంది. ప్రస్తుతం రష్మిక ఏజ్ 26 కాగా.. చెల్లెలు షిమాన్ కి షుమారు 10-12 ఏళ్ళు ఉంటాయి. 

I miss this lil baby every time I’m away from her……she’s growing up too fast 🥺she’s in the 4th going to the 5th.. her exams are going on right now.. 😄wish her luck guys.. 😋 https://t.co/OpaVN5tG52

— Rashmika Mandanna (@iamRashmika)

కన్నడ అమ్మాయి అయిన రష్మిక హీరోయిన్ అయ్యాక ఫ్యామిలీ బాగా సెటిల్ అయ్యింది. తన చిన్నతనంలో రష్మిక కఠిన పేదరికం అనుభవించారట. కనీసం సొంత ఇల్లు కూడా లేదట. ప్రతి నెలా అద్దె చెల్లించే స్థోమత లేక తరచుగా ఇళ్ళు మారేవాళ్లమని, అద్దె ఇళ్ళ కోసం వీధులు పట్టుకు తిరిగామని ఆమె చెప్పడం కొసమెరుపు. ఇదిలా ఉంటే ఒకటి రెండు సందర్భాల్లో ఆమె నివాసం, ఆఫీసులపై ఐటీ దాడులు జరిగాయి. 

ప్రస్తుతం రష్మిక కెరీర్ పీక్స్ లో ఉంది. రష్మిక చేతిలో రెండు బడా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అల్లు అర్జున్ కి జంటగా పుష్ప 2 చేస్తున్నారు. శ్రీవల్లి పాత్రలో మరోసారి ఆమె అలరించనుంది. పుష్ప 2లో రష్మిక పాత్ర నిడివి తగ్గించారనే ప్రచారం జరుగుతుంది. అలాగే రన్బీర్ కపూర్ కి జంటగా యానిమల్ మూవీ చేస్తున్నారు. ఈ బాలీవుడ్ చిత్రానికి అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకుడు. గ్యాంగ్ స్టర్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కుతున్నట్లు సమాచారం.

click me!