రజనీకాంత్‌ తెలుగు డైరెక్టర్‌తో సినిమా కన్ఫమా?

Published : Mar 20, 2023, 05:06 PM ISTUpdated : Mar 20, 2023, 05:16 PM IST
రజనీకాంత్‌ తెలుగు డైరెక్టర్‌తో సినిమా కన్ఫమా?

సారాంశం

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ నెక్ట్స్ సినిమాల విషయంలో జోరు పెంచుతున్నారు. వరుసగా ఆయన సినిమాలకు కమిట్‌ అవుతున్నారు. అయితే ఆయన తెలుగు దర్శకుడితో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారట.   

సౌత్‌ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌.. వయసు మీద పడినా కొద్ది సినిమాల జోరు పెంచుతున్నారు. ఆయన బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలను లైన్‌లో పెడుతూ యంగ్‌ హీరోలకు షాకిస్తున్నారు. ఇప్పుడు నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో `జైలర్‌` చిత్రంలో నటిస్తున్నారు. ఇది చిత్రీకరణ దశలో ఉంది. ఇందులో భారీ కాస్టింగ్‌ నటించబోతుంది. హీరోయిన్‌గా తమన్నా చేస్తుండగా, మోహన్‌లాల్‌, శివరాజ్‌కుమార్‌, సునీల్‌ వంటి వారు నటిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 

ఇదిలా ఉంటే నెక్ట్స్ రజనీకాంత్‌ ఎవరితో సినిమా చేస్తారనేది ఆసక్తిగా మారింది. తమిళనాట ఇద్దరు ముగ్గురు దర్శకుల పేర్లు వినిపించాయి. వారిలో ప్రదీప్‌ రంగనాథన్‌, అలాగే `జై భీమ్‌` ఫేమ్‌ టీజే జ్ఞానవేల్‌ వంటి వారి పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ ఇద్దరు రజనీకాంత్‌కి స్టోరీ నెరేట్‌ చేశారు. వీటిపై ఆయన ఆసక్తిని కూడా కనబరిచారట. వీరితోపాటు మణిరత్నం కూడా లైన్‌లో ఉన్నారని సమాచారం. మరి ఈ ముగ్గురిలో రజనీ నెక్ట్స్ ఎవరితో సినిమా చేస్తారనేది మాత్రం పెద్ద సస్పెన్స్. 

ఇదిలా ఉంటే ఇవి ఓ వైపు నడుస్తుండగా, ఇప్పుడు తెలుగు దర్శకుడు తెరపైకి రావడం ఆశ్చర్యపరుస్తుంది. `బింబిసార` చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించాడు దర్శకుడు వశిష్ట. ఆయన `బింబిసార2` తెరకెక్కించాల్సి ఉంది. కానీ సరైన కథ లేదు. ఓ వైపు ఆ ప్లాన్‌ జరుగుతుండగానే వశిష్ట.. ఏకంగా రజనీకాంత్‌ని కలిసి ఓ అదిరిపోయే స్టోరీ నెరేట్‌ చేశాడట. ఆ మధ్య దీనికి సంబంధించిన ఫోటో కూడా బయటకొచ్చింది. వశిష్ట చెప్పిన ఓ మైండ్‌ బ్లోయింగ్‌ కథకి రజనీకాంత్‌ ఇంప్రెస్‌ అయ్యారట. సినిమా చేసేందుకు ఆల్మోస్ట్ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారనే ప్రచారం జరుగుతుంది. అయితే తమిళ దర్శకులతో ముందు వెళ్తాడా? లేక వశిష్ట తో సినిమా చేస్తారా అనేది పెద్ద సస్పెన్స్. ఇది ఇప్పుడు రజనీ చేతిలో ఉన్న నిర్ణయం.

రజనీ సన్నిహిత వర్గాలు, వశిష్టకి సంబంధించి టాలీవుడ్‌ నుంచి అందుతున్న సమాచారం మేరకు రజనీకాంత్‌ .. వశిష్ట స్క్రిప్ట్ విషయంలోనే బాగా ఎగ్జైట్‌గా ఉన్నారని తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన ఫుల్‌ స్క్రిప్ట్ రెడీ చేయాలని, కొన్నిసూచనలు కూడా చేశారని టాక్‌. ఆల్మోస్ట్ రజనీ ఈ సినిమా చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. ఇదే సెట్‌ అయితే వశిష్ట రేంజ్‌ మారిపోతుందని, స్టార్‌ డైరెక్టర్‌ జాబితాలో చేరిపోతారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరోవైపు వశిష్ట ఇప్పటికే `బింబిసార2` నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలో మరో దర్శకుడు అనిల్‌ పాడూరిని తీసుకున్నారు.

ఇక ప్రస్తుతం రజనీకాంత్‌ `జైలర్‌` చిత్రంతోపాటు తన కూతురు ఐశ్వర్య రజనీకంత్‌ రూపొందిస్తున్న `లాల్‌ సలామ్‌` చిత్రంలోనూ నటిస్తున్నారు. ఇందులో ఆయన గెస్ట్ రోల్‌ చేస్తున్నారు. నిడివి కాస్త ఎక్కువగానే ఉంటుందట.దాదాపు ఏడు రోజుల కాల్షీట్లు ఇచ్చినట్టు సమాచారం. అయితే ఈ సినిమా కోసం ఆయనకు 25కోట్ల పారితోషికం అందుకుంటున్నారని సమాచారం. మరోవైపు `జైలర్‌` కోసం కూడా భారీగానే పొందుతున్నారట రజనీ. ఈ చిత్రం కోసం హైయ్యెస్ట్ గా ఏకంగా రూ140కోట్ల పారితోషికం ఇస్తున్నారని సమాచారం. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Chiranjeevi: ఎన్టీఆర్ కి చుక్కలు చూపించిన కథతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన చిరంజీవి, టాలీవుడ్ మొత్తం షేక్
Kriti Sanon: అల్లు అర్జున్‌పై మహేష్‌ బాబు హీరోయిన్‌ ఇంట్రెస్ట్