NTR: హైదరాబాద్ చేరుకున్న ఎన్టీఆర్... మోస్ట్ స్టైలిష్ లుక్ వైరల్!

By Sambi Reddy  |  First Published Sep 19, 2023, 10:35 AM IST

హీరో ఎన్టీఆర్ దుబాయ్ నుండి హైదరాబాద్ చేరుకున్నారు. ఫ్యామిలీతో పాటు ఆయన ఎయిర్పోర్ట్ లో కనిపించారు. 
 


యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల దుబాయ్ కి వెళ్లిన విషయం తెలిసిందే. దుబాయ్ వేదికగా సెప్టెంబరు 15, 16 తేదీల్లో జరిగిన సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్(సైమా) వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి గానూ ఎన్టీఆర్ ఉత్తమ నటుడు అవార్డు కైవసం చేసుకున్నారు. రామ్ చరణ్, నిఖిల్, దుల్కర్ సల్మాన్, సిద్ధు జొన్నలగడ్డ, అడివి శేష్ టాలీవుడ్ నుండి ఉత్తమ నటుడు అవార్డుకి పోటీపడ్డారు. కొమరం భీమ్ గా అద్భుత పెర్ఫార్మన్స్ ఇచ్చిన ఎన్టీఆర్ సైమా ఉత్తమ నటుడు అవార్డుకి ఎంపికయ్యారు. 

ఈ క్రమంలో కుటుంబంతో పాటు ఆయన దుబాయ్ వెళ్లారు. ఈవెంట్ ముగించుకుని ఎన్టీఆర్ హైదరాబాద్ చేరుకున్నారు. ఎన్టీఆర్ ఫ్యామిలీ ఎయిర్పోర్ట్ లో దర్శనం ఇవ్వడంతో ఫోటోగ్రాఫర్స్ ఆయన వెంటబడ్డారు. ఎన్టీఆర్ మీడియాకు అభివాదం తెలిపి అక్కడ నుండి వెళ్లిపోయారు. 

Young Tiger with family back to Hyderabad post winning best actor award in pic.twitter.com/s1WvkiMzms

— ARTISTRYBUZZ (@ArtistryBuzz)

Latest Videos

ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్నారు. దర్శకుడు కొరటాల శివ దేవర షూటింగ్ నిరవధికంగా వరుస షెడ్యూల్స్ లో పూర్తి చేస్తున్నాడు. విడుదలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో శరవేగంగా షూటింగ్ జరుగుతుంది. దేవర చిత్ర విఎఫ్ఎక్స్ వర్క్ కి చాలా సమయం కావాలని సమాచారం. అందుకే షూటింగ్ వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలని యూనిట్ భావిస్తోంది. 

దేవర చిత్రంలో ఎన్టీఆర్ కి జంటగా జాన్వీ కపూర్ నటిస్తుంది. సైఫ్ అలీ ఖాన్ ప్రధాన విలన్ రోల్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మిస్తుంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. 2024 ఏప్రిల్ 5న దేవర పాన్ ఇండియా చిత్రంగా విడుదల కానుంది. రూ. 300 కోట్లకు పైగా బడ్జెట్ తో దేవర తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. 

click me!