మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ని కలిసిన నటి పూనమ్ కౌర్

Published : Aug 13, 2022, 10:32 PM IST
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ని కలిసిన నటి పూనమ్ కౌర్

సారాంశం

సంచలనాల హీరోయిన్ పూనమ్ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ను కలిశారు. ఢిల్లీలో ఆయన ఇంటికి వెళ్లిన హీరోయిన్ సోషల్ మీడియాలో ఈ విషయాన్ని శేర్ చేశారు. 

నటి పూనమ్ కౌర్ తన సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. ఆమె  మాజీ ప్రైమ్ మినిస్టర్  మన్మోహన్ సింగ్ ని కలిశారు. 75వ ఇండిపెండెన్స్ డే ని  పురస్కరించుకుని పూనమ్ ఆయన ఇంటికి వెళ్లారు. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియాలో అనౌన్స్ చేశారు. అంతే కాదు మన్మోహన్ సింగ్ ఇంట్లో ఆమె క్లిక్ మనిపించిన  ఫోటోలను కూడా  పోస్ట్ చేశారు. 

ఈ సందర్భంగా పూనమ్ కౌర్ ఓ నోట్ కూడా రాశారు. పూనం ఏమన్నదంటే..? మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారిని గౌరవ పూర్వకంగా కలిశాను. చాలా సంతోషంగా ఉంది. 75 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఖాదీ తిరంగాను బహూకరించాను. పాకిస్థాన్ లోని గురుద్వారా దగ్గర తీసుకున్న ప్రత్యేకమైన గులకరాళ్ళ బాక్స్ ని కూడా గిఫ్ట్ గా ఇచ్చాను. దానికి ఆయన పేరు కూడా పెట్టారు అని పూనమ్ వివరించారు. 

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్‌తో కలిసి పూనమ్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను కలిశారు. ఆయన్ని కలవడం చాలా సంతోషంగా అనిపించిందని వెల్లడించారు. అంతే కాదు పూనమ్ కౌర్ మన్మోహన్ సింగ్ తో పాటు  ఆయన సతీమణి దగ్గర కూడా  ఆశీర్వాదం తీసుకున్నారు. ఇక్కడికి రావడం... ఆయన్నకు కలవడం కలగా ఉందన్నారు పూనం  

కాంగ్రెస్ తరపునుంచి రెండు సార్లు ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు మన్మోహన్ సింగ్. ఆయనకు ఆర్ధికవేత్తగా కూడా మంచి పేరు ఉంది. అయితే వయస్సు మీదపడుతుండటంతో పాటు వృద్ధాప్యం, అనారోగ్య కారణాల వల్ల ఆయన   ప్రత్యక్ష రాజకీయాలకి దూరంగా ఉంటున్నారు.

ఇక పూనం కౌర్ విషయానికి వస్తే.. ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది బ్యూటీ.  కాంట్రవర్షియల్ ట్వీట్స్ చేస్తూ..  సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది పూనమ్ కౌర్. ఒకప్పుడు హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసిన పూనమ్ కౌర్ ఆ తరువాత అవకాశాలు తగ్గడంతో టాలీవుడ్ కు  దూరమైంది.  చివరిగా నితిన్ హీరోగా వచ్చిన శ్రీనివాస కల్యాణం సినిమాలో  హీరోయిన్ అక్క పాత్రలో కనిపించింది. ఆతరువాత ఆమె ఏ సినిమా చేయలేదు. 
ప్రస్తుతం పూనమ్ కౌర్ నాతిచరామి సినిమాలో నటిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?
Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?