హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఎమోషనల్ అయ్యారు. వాళ్ళ అమ్మకు ఆరోగ్యం బాగోకపోవడంతో కోలుకోవాలని ప్రార్థించండి అంటూ... సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కి విజ్ఞప్తి చేశారు.
జయాపజయాలతో సంబంధం లేకుండా పాయల్ రాజ్ పుత్ కి తెలుగులో క్రేజ్ ఉంది. ఒక్క మూవీతో ఆమె ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. తెలుగులో ఆమె డెబ్యూ మూవీ ఆర్ఎక్స్ 100. దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ కొట్టింది. నెగిటివ్ షేడ్స్ తో కూడిన బోల్డ్ రోల్ లో పాయల్ అద్భుతం చేసింది. ఆర్ఎక్స్ 100 తర్వాత ఆ స్థాయి విజయం మరలా ఆమెకు దక్కలేదు. రవితేజ, వెంకటేష్ వంటి స్టార్స్ పక్కన ఛాన్స్ వచ్చినా... హిట్ బ్రేక్ రాలేదు.
ఇటీవల మంగళవారం మూవీతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అజయ్ భూపతి మరోసారి ఆమెను అద్భుతమైన పాత్రలో ప్రెజెంట్ చేశాడు. శృంగార కోరికలతో బాధపడే అరుదైన వ్యాధి కలిగిన అమ్మాయి పాత్రలో పాయల్ రాజ్ పుత్ మెప్పించింది. మంగళవారం మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె తమిళ, కన్నడ భాషల్లో సినిమాలు చేస్తున్నట్లు సమాచారం.
కాగా పాయల్ రాజ్ పుత్ తల్లిగారు అనారోగ్యానికి గురయ్యారు. ఆమె మోకాలి ఆపరేషన్ చేయించుకున్నారట. మోకాలి మార్పిడి చేయించుకున్న పాయల్ తల్లి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారట. తన తల్లి కోసం ప్రార్ధనలు చేయాలని పాయల్ రాజ్ పుత్ సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ కి విజ్ఞప్తి చేసింది. పాయల్ రాజ్ పుత్ పోస్ట్ వైరల్ అవుతుంది.
సీరియల్ నటిగా పాయల్ కెరీర్ మొదలైంది. ఇక చాలా కాలంగా ఆమె సౌరభ్ దింగ్రా అనే వ్యక్తితో రిలేషన్ లో ఉంది. ఈ విషయాన్ని ఆమె ఓపెన్ గా చెప్పారు. వీరిద్దరూ కలిసి కొన్ని మ్యూజిక్ ప్రాజెక్ట్స్ కూడా చేసినట్లు సమాచారం. మరి పెళ్లి ఎప్పుడు చేసుకుంటారో చూడాలి...