
మౌనిక అనే యువతి ఫిర్యాదు మేరకు షణ్ముఖ్ జస్వంత్ అన్నయ్య సంపత్ కోసం పోలీసులు నివాసానికి వెళ్లారు. అక్కడ షణ్ముఖ్ గంజాయి మత్తులో ఉన్నాడని, గదిలో గంజాయి కూడా లభ్యం అయ్యిందని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం షణ్ముక్ బ్రదర్స్ పోలీసుల అదుపులో ఉన్నారు. ఈ కేసు గురించి షణ్ముఖ్ తరపు న్యాయవాది దిలీప్ సుంకర మీడియాతో మాట్లాడారు. విచారణ ముగిస్తే కానీ నిజానిజాలు తెలియవు అన్నారు.
దిలీప్ సుంకర మాట్లాడుతూ... మౌనిక-సంపత్ గత ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. త్వరలో పెళ్లి కూడా చేసుకోవాలి అనుకున్నారు. ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించారు. పెళ్లి కోసం మౌనికకు రూ. 40 లక్షలు ఖర్చు చేశారు. దానికి ఆధారాలు కూడా ఉన్నాయి. కొద్ది రోజుల్లో పెళ్లి అనగా ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దాంతో సమస్య మొదలైంది. అమ్మాయి కేసు పెట్టింది కానీ.. ఆమెతో పేరెంట్స్ రాలేదు.
మౌనిక ఫిర్యాదు మేరకు సంపత్ కోసం వచ్చిన పోలీసులు ఆయన లేకపోవడంతో షణ్ముఖ్ ఉండే రూమ్ కి వచ్చారు. అది అందరూ వచ్చిపోయే రూమ్. షణ్ముఖ్ వర్క్ ప్లేస్ కూడాను. చాలా మంది వచ్చి పోతుంటారు. గదిలో దొరికిన గంజాయి ఎవరిది అనేది పోలీసులు విచారించాల్సి ఉంది. పోలీసులు వచ్చే నాటికి షణ్ముఖ్ ఏ కండిషన్ లో ఉన్నాడు అనేది తెలియదు. దీనికి సంబంధించిన వీడియో ఉంది. సంపత్ కేసును లోతుగా విచారించేందుకు షణ్ముఖ్ ని ప్రశ్నలు అడగ్గా సహకరించలేదని అంటున్నారు.
షణ్ముఖ్ ఇంటికి ఈ మధ్య కాలంలో ఎవరెవరు వచ్చారు? సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా తెలుసుకోవాల్సి ఉంది. షణ్ముఖ్ మీద వచ్చింది ఆరోపణలు మాత్రమే. విచారణలో నిజాలు తేలుతాయి... అని దిలీప్ సుంకర క్లారిటీ ఇచ్చారు. దిలీప్ సుంకర గత నాలుగేళ్లుగా షణ్ముఖ్ వద్ద లీగల్ అడ్వైసర్ గా పని చేస్తున్నాడని సమాచారం.