క్షమించు నిన్ను కాపాడుకోలేక పోయాను... పాయల్ రాజ్ పుత్ ఇంట్లో విషాదం!

Published : Dec 31, 2023, 07:00 PM IST
క్షమించు నిన్ను కాపాడుకోలేక పోయాను... పాయల్ రాజ్ పుత్ ఇంట్లో విషాదం!

సారాంశం

పాయల్ రాజ్ పుత్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె పెట్ డాగ్ కాండీ కన్నుమూసింది. కాండీని తలచుకుని పాయల్ రాజ్ పుత్ ఎమోషనల్ అవుతుంది.   

న్యూ ఇయర్ వేళ  హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె ప్రేమగా పెంచుకున్న పెట్ డాగ్ కాండీ కన్నుమూసింది. దీంతో పాయల్ కన్నీరు మున్నీరు అవుతుంది. తన జ్ఞాపకాలు నెమరువేసుకుంటూ వీడియోలు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. చాలా కాలంగా కాండీ పాయల్ వద్ద ఉన్నట్లు సమాచారం. కాండీ తో పాయల్ కి గట్టి అనుబంధం ఉన్న నేపథ్యంలో పాయల్ గుండెకు గాయమైంది. 

అమ్మను క్షమించు. నేను నిన్ను కాపాడుకోలేకపోయాను. నీ ప్రేమను కోల్పోయాను.. అంటూ పాయల్ ఒక ఎమోషనల్ నోట్ పోస్ట్ చేసింది. ఇక పాయల్ రాజ్ పుత్ కెరీర్ పరిశీలిస్తే... ఆమె నటించిన మంగళవారం హిట్ అయ్యింది. మరోసారి పాయల్ రాజ్ పుత్ బోల్డ్ రోల్ చేసింది. 

మంగళవారం చిత్రాన్ని దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించాడు. హిట్ టాక్ వచ్చినా పెద్దగా వసూళ్లు రాలేదు. కొన్ని కారణాలు దెబ్బతీశాయి. ప్రస్తుతం మంగళవారం ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులోకి వచ్చింది. ఓటీటీలో మంగళవారం సినిమాకు చెప్పుకోదగ్గ రెస్పాన్స్ వస్తుంది. 

PREV
click me!

Recommended Stories

Samantha Honeymoon Plans, రాజ్ తో కలిసి రొమాంటిక్ ట్రిప్ ప్లాన్ చేసిన సమంత, ఎక్కడికి వెళ్లబోతున్నారో తెలుసా?
49 ఏళ్ల వయసులో ఇండియాకు మెడల్ సాధించిన నటి, ఏకంగా 4 పతకాలతో మెరిసిన ప్రగతి