
దర్శక ధీరుడు రాజమౌళి, గ్లోబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం `ఛత్రపతి`. 2005లో వచ్చిన ఈ మూవీ అప్పటి బాక్సాఫీసు రికార్డులను బ్రేక్ చేసింది. అతిపెద్ద సక్సెస్‌ఫుల్ ఫిల్మ్ గా నిలిచింది. అటు ప్రభాస్‌కి బిగ్ బ్రేక్‌ని ఇచ్చింది. ఇటు రాజమౌళి కెరీర్‌లో పెద్ద హిట్ మూవీగా నిలిచింది. హీరోయిన్ శ్రీయాకి సక్సెస్ దక్కింది. మొత్తంగా ప్రభాస్‌ని మాస్ హీరోగా మరే లెవల్‌కి తీసుకెళ్లింది. ఈ సినిమా విడుదలై 18ఏళ్లు అవుతుంది. అయితే ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ కోసం ఇద్దరు గొడవ పడటం ఆసక్తికరంగా మారింది.
రాజమౌళి సినిమాలు సక్సెస్ అయితే ఎవరైనా క్రెడిట్ ఆయనకే ఇస్తారు. రాజమౌళి వల్లే సినిమా ఆడిందంటారు. ఆయన తర్వాతనే హీరోలకు క్రెడిట్ దక్కుతుంది. ఆయన తన సినిమాలను అలా తీసుకొస్తారు, అలా ప్రమోట్ చేస్తారు. ఆడియెన్స్ దగ్గరికి తీసుకెళ్తారు. అయితే `ఛత్రపతి` సినిమా సక్సెస్ క్రెడిట్ కూడా రాజమౌళికే దక్కింది. కానీ ప్రభాస్ ఎక్కువగా తీసుకెళ్లాడు. ఇంకాచెప్పాలంటే ప్రభాస్ ఖాతాలోకి వెళ్లింది. ఆయనకే ఎక్కువగా పేరొచ్చింది. అయితే ఈ విషయం మీదే ఇద్దరి మధ్య గొడవ జరగడం గమనార్హం.
మొదట్లో `ఛత్రపతి` సక్సెస్ క్రెడిట్ నీదంటే నీది అని ఒకరి గురించి ఒకరు గొప్పగా చెప్పుకున్నారు. ఈ మూవీ సక్సెస్‌కి కారణం రాజమౌళినే అని ప్రభాస్ చెప్పగా, లేదు ప్రభాస్ వల్లే సక్సెస్ అయ్యిందని రాజమౌళి తెలిపారు. ఈ ఇద్దరి కామెంట్లకి చిత్ర నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నే సాక్ష్యం. ఆయన సమక్షంలోనే ఈ ఇద్దరి మధ్య చర్చ జరిగింది. కానీ రూమ్ లోనుంచి బయటకు వెళ్లాక మాత్రం ఇద్దరు గొడవ పడటం గమనార్హం.
రాజమౌళి వచ్చిన తన రైటింగ్ డిపార్ట్ మెంట్ వద్ద తన బాధని వెల్లడించారు. `ఛత్రపతి` ఎవరి వల్ల హిట్ అయ్యిందంటే నీవల్లే అని అంతా అన్నారు. వారిలో ఫాదర్ విజయేంద్ర ప్రసాద్ కూడా ఉన్నారు. అయితే హీరో మాత్రం అది ఒప్పుకోవడం లేదని చెప్పుకున్నాడు. మరోవైపు తన టీమ్ వద్దకి వెళ్లి ప్రభాస్ సైతం `ఛత్రపతి` ఎవరి వల్ల హిట్ అయ్యిందంటే నీ వల్లే అని వాళ్లంతా అన్నారు. కానీ దర్శకుడు ఒప్పుకోవడం లేదని వాళ్ల వద్ద వాపోయాడు. మొత్తంగా ఇద్దరి మధ్య గొడవ గట్టిగానే అయ్యింది. ప్రస్తుతం ఈ అరుదైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అయితే ఇదంతా వాళ్లు ఫన్నీ కోసం చేసిన వీడియోగా తెలుస్తుంది. చిత్ర ప్రమోషన్ కోసం రాజమౌళి, ప్రభాస్ ఇలా ఫన్నీగా ఈ వీడియోని డిజైన్ చేసినట్టు తెలుస్తుంది. నిజంగానే వాళ్లు చేశారా? లేక ఫ్యాన్స్ ఇలా ప్లాన్ చేశారో తెలియదు కానీ ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే రాజమౌళికే ఇలాంటి ఐడియాస్ వస్తుంటాయి. కచ్చితంగా ఆయనే ఇది ప్లాన్ చేసి ఉంటాడని అంటున్నారు. ఎవరు చేసినీ ఫన్నీగా ఉన్న ఈ వీడియో మాత్రం ఫ్యాన్స్ ని ఆద్యంతం ఆకట్టుకుంటుంది.