అజిత్, రజినీకాంత్ ల పోరు.. ఫ్యాన్స్ గుస్సా!

Published : Jan 07, 2019, 01:54 PM IST
అజిత్, రజినీకాంత్ ల పోరు.. ఫ్యాన్స్ గుస్సా!

సారాంశం

తమిళ సినీ పరిశ్రమలో అగ్ర హీరోలుగా వెలుగొందుతోన్న రజినీకాంత్, అజిత్ లు ఇప్పుడు బాక్సాఫీస్ ముందు బరిలోకి దిగబోతున్నారు. అజిత్ నటించిన 'విశ్వాసం', రజినీకాంత్ నటించిన 'పేటా' సినిమాలు ఒకేరోజు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధపడుతున్నాయి. 

ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఈ రెండు సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రెండు పెద్ద సినిమాలు ఒకేరోజు థియేటర్లలోకి రావడంతో ఓపెనింగ్స్ పై ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది. అభిమానుల మధ్య గొడవలు కూడా మొదలయ్యే అవకాశాలు ఉంటాయి. 

దీంతో కొందరు ఇండస్ట్రీ పెద్దలు రెండు రోజుల వ్యవధిలో సినిమాను విడుదల చేసే విధంగా ప్రయత్నాలు చేశారు. కానీ అది వర్కవుట్ కాలేదు. ఫలితంగా రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద తలపడనున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో తలైవా, అజిత్ అభిమానుల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.

తమ హీరోల చిత్రాలు విడుదలయ్యే థియేటర్ల పేర్లు, సంఖ్యను వెల్లడించాలని అభిమానులు కోరడంతో 'విశ్వాసం' చిత్రబృందం లిస్ట్ ని రిలీజ్ చేసింది. టికెట్ విక్రయాలు కూడా మొదలయ్యాయి. కానీ 'పేటా' థియేటర్ల జాబితాను మాత్రం విడుదల చేయలేదు. 
 
PREV
click me!

Recommended Stories

చిరంజీవి, అనిల్ రావిపూడి రెమ్యునరేషన్స్ కే బడ్జెట్ మొత్తం అయిపోయిందా ? ఇక సినిమా పరిస్థితి ఏంటి ?
Illu Illalu Pillalu Today Episode Dec 17: వల్లిని గట్టిగా నిలదీసిన రామరాజు, దొంగ సర్టిఫికెట్లతో భాగ్యం