విడాకుల వార్తలు, హీరోయిన్ నమితకు ఫోన్లు... అలా క్లారిటీ ఇచ్చేసిన హాట్ బ్యూటీ!

By Sambi ReddyFirst Published May 28, 2024, 4:42 PM IST
Highlights

హీరోయిన్ నమిత భర్తతో విడిపోతున్నారన్న వార్తలు సంచలనం రేపుతుండగా... ఆమె క్లారిటీ ఇచ్చారు. స్వయంగా జరిగిన విషయం ఏమిటో వెల్లడించారు. 
 


2002లో విడుదలైన సొంతం చిత్రంతో నమిత సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యింది. దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ సూపర్ హిట్. రెండో చిత్రంలోనే విక్టరీ వెంకటేష్ పక్కన ఛాన్స్ కొట్టేసింది. జెమినీ టైటిల్ తో విడుదలైన ఆ చిత్రం ఆశించినంతగా ఆడలేదు. ఓ రాధా ఇద్దరు కృష్ణుల పెళ్లితో మరో హిట్ ఖాతాలో వేసుకుంది. 

బిల్లా మూవీలో ప్రభాస్ తో జతకట్టింది అమ్మడు. ఆ చిత్రంలో నెగిటివ్ షేడ్స్ తో కూడిన గ్లామరస్ రోల్ చేసింది. బిల్లా హిట్ టాక్ తెచ్చుకుంది. 2010లో విడుదలైన సింహా చిత్రంలో బాలయ్యతో జతకట్టింది. దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సూపర్ హిట్ కొట్టింది. అయినా నమితకు చెప్పుకోదగ్గ ఆఫర్స్ రాలేదు. బారెడు హైట్ ఉండే నమిత భారీగా బరువు పెరడం కూడా మైనస్ అయ్యింది. 

Latest Videos

2017లో నమిత వివాహం చేసుకుంది. వ్యాపారవేత్త అయిన వీరేంద్ర చౌదరిని ఆమె వివాహమాడారు. వీరికి 2022లో కవల అబ్బాయిలు పుట్టారు. వివాహం అనంతరం నమిత సిల్వర్ స్క్రీన్ పై అరుదుగా కనిపిస్తున్నారు. కాగా భర్త వీరేంద్ర చౌదరితో నమితకు మనస్పర్థలు తలెత్తాయని న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కొన్ని మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. ఈ క్రమంలో నమిత స్వయంగా స్పష్టత ఇచ్చింది. 

నేను భర్తతో విడిపోతున్నానంటూ వార్తలు వస్తున్నాయి. దాంతో మా బంధువులు, సన్నిహితులు ఫోన్లు చేస్తున్నారు. ఇలాంటి పుకార్లకు చెక్ పెట్టాలనే నేను ఇటీవల భర్తతో ఉన్న ఫోటో ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశాను. అయినా విడాకుల వార్తలు ఆగలేదు. ఈ పుకార్లు విన్నప్పుడు నేను, నా భర్త నవ్వుకుంటాము. విడాకుల వార్తల విషయంలో మేము బాధపడటం లేదు... అని నమిత అన్నారు. నమిత స్టేట్మెంట్ విడాకుల ఊహాగానాలకు చెక్ పెట్టింది. 

click me!