గుణశేఖర్ కొత్త సినిమా ప్రకటన..టైటిల్ ఇదే

By Surya PrakashFirst Published May 28, 2024, 1:25 PM IST
Highlights

తన గుణ హ్యాండ్‌మేడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై నీలిమ గుణ నిర్మాతగా ఈ కొత్త సినిమా ప్రకటించారు. గుణశేకర్ తీయబోయే ఈ సినిమా పేరు..


ఒకప్పుడు మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి స్టార్స్ తో సినిమాలు తీసి హిట్ కొట్టిన గుణ శేఖర్ ఈ మధ్యకాలంలో పూర్తి గా వెనకబడ్డారు. అయితే ఆయనలో మ్యాజిక్ పోలేదని ఇప్పటికీ నమ్ముతూంటారు. అది సోషల్ ఇష్యూ అయినా  పౌరాణికం, .. జానపదం ఏదైనా  సైతం గొప్పగా తీయగల దర్శకుడిగా గుణశేఖర్ కి మంచి క్రేజ్  తగ్గలేదు. ఇక చాలాకాలంగా గుణశేఖర్ సొంత బ్యానర్లోనే సినిమాలు చేస్తున్నారు. గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై ఆయన నుంచి సినిమాలు వస్తున్నాయి. ఆ మధ్య ఆయన బ్యానర్లో 'శాకుంతలం' సినిమా వచ్చింది.

 సమంత ప్రధాన పాత్రలో  నటించిన ఈ సినిమా, భారీ విజయాన్ని అందుకుంటుందని అంతా భావించారు.  అయితే ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా, ఆ స్థాయిలోనే నష్టాలను చూసింది.  ఆ సినిమా విడుదల తరువాత గుణశేఖర్ మౌనంగా ఉండిపోయారు. ఇంతకాలంగా గుణశేఖర్ అదే మౌనాన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఆయన సినిమాలను ఇష్టపడేవారు, కొత్త ప్రాజెక్టు ఎనౌన్స్ మెంట్ ఎప్పుడు ఉంటుందా అని ఎదురుచూస్తున్నారు. ఆ ఎనౌన్స్ మెంట్ ఈ రోజు వచ్చింది.  తమ బ్యానర్లో సినిమా ఎనౌన్స్ మెంట్ ఈ రోజు ఉదయం 11 గంటలకు  ఒక పోస్టర్ లా వదిలారు. 

Latest Videos

ఇక తన గుణ హ్యాండ్‌మేడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై నీలిమ గుణ నిర్మాతగా ఈ కొత్త సినిమా ప్రకటించారు. గుణశేకర్ తీయబోయే ఈ సినిమా పేరు 'యుఫోరియా’ అని పెట్టారు, చిత్రీకరణ త్వరలోనే ప్రారంభం అవుతుంది అని కూడా ప్రకటించారు. అయితే ఈ సినిమా గురించిన ఇంకెటువంటి వివరాలు చెప్పలేదు. ఇది ఏ జోనర్లో ఉంటుంది? .. ఎవరితో ఉంటుంది? అనేది ఇప్పుడు ఆసక్తిని రేకెత్తించే విషయం.  ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి అని ఆ ప్రకటనలో చెప్పారు. సినిమాలో న‌టించబోయే న‌టీన‌టులు, ఇత‌ర సాంకేతిక నిపుణుల‌కు సంబంధించిన వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తామ‌ని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.
 

click me!