దాని కోసం కడుపు తెచ్చుకోవాల్సిన పని లేదు... సంచలనం రేపుతున్న హీరోయిన్ మెహ్రీన్ పోస్ట్!

Published : May 15, 2024, 06:59 AM ISTUpdated : May 15, 2024, 07:12 AM IST
దాని కోసం కడుపు తెచ్చుకోవాల్సిన పని లేదు... సంచలనం రేపుతున్న హీరోయిన్ మెహ్రీన్ పోస్ట్!

సారాంశం

హీరోయిన్ మెహ్రీన్ పిర్జాడ మీడియా పై ఫైర్ అయ్యారు. తప్పుడు వార్తలు రాస్తున్నారంటూ ఆవేదనచెందారు. ఓ సుదీర్ఘ సందేశం ఆమె పోస్ట్ చేశారు. మెహ్రీన్ సంచలన పోస్టి వైరల్ అవుతుంది.   

హీరోయిన్ మెహ్రీన్ ఫిర్జాడ ఇటీవల ఎగ్ ఫ్రీజింగ్ కి పాల్పడ్డారు. ఆమె తన గర్భాశయం నుండి అండాలు తీసి భద్రపరుచుకున్నారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. ఈ విషయం చెప్పాలా వద్దా? అని సందిగ్ధానికి గురయ్యానని మెహ్రీన్ తెలియజేశారు. ప్రపంచంలోని చాలా మంది మహిళలకు స్ఫూర్తిగా నిలవాలని, వాళ్లలో అవగాహన పెంచాలని ఎగ్ ఫ్రీజింగ్ కి పాల్పడిన విషయం బయటపెట్టానని మెహ్రీన్ అన్నారు

ఈ క్రమంలో మెహ్రీన్ మీద కొన్ని పుకార్లు తెరపైకి వచ్చాయి. మెహ్రీన్ గర్భం దాల్చారని, ఆమె పెళ్లి కాకుండానే తల్లి అయ్యారంటూ మీడియాలో వార్తలు రావడమైంది. ఈ కథనాల మీద మెహ్రీన్ స్పందించారు. ఆమె మీడియా రాతలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోవడానికి గర్భం దాల్చాల్సిన అవసరం లేదు. మీ స్వార్థం కోసం తప్పుడు కథనాలు వండి వారుస్తున్నారు. జర్నలిస్టులకు బాధ్యత ఉండాలి. 

పిల్లలు అప్పుడే వద్దని భావించే తల్లిదండ్రులు అన్ని విధాలుగా సిద్ధం అయ్యాక పిల్లల్ని కనేందుకు ఎగ్ ఫ్రీజింగ్ పద్ధతి ఉపయోగపడుతుంది. ఈ విధానం గురించి సరిగా తెలియకుండా ఇష్టం వచ్చినట్లు రాస్తున్నారు. ఇప్పటికైనా తప్పుడు వార్తలు ప్రచారం చేయడం మానకపోతే చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది.... అని మెహ్రీన్ హెచ్చరించారు. వయసులో ఉన్నప్పుడు ఆరోగ్యంగా ఉన్న ఎగ్స్ ఫ్రీజింగ్ చేయడం ద్వారా భవిష్యత్ తో పిల్లల్ని కనవచ్చు. తాను కూడా ఎగ్ ఫ్రీజింగ్ కి పాల్పడ్డానని ఆ మధ్య రామ్ చరణ్ వైఫ్ ఉపాసన చెప్పడం విశేషం. 

కాగా మెహ్రీన్ 2021లో భవ్య బిష్ణోయ్ అనే వ్యక్తితో మెహ్రీన్ కి ఎంగేజ్మెంట్ జరిగింది. కారణం తెలియదు కానీ ఆ వివాహం రద్దు అయ్యింది. ఇక మెహ్రీన్ కెరీర్ పరిశీలిస్తే ఏమంత ఆశాజనకంగా లేదు. ఆమెకు ఆఫర్స్ తగ్గాయి. గత ఏడాది స్పార్క్ టైటిల్ తో ఒక చిత్రం చేసింది. ప్రస్తుతం ఓ కన్నడ చిత్రం చేస్తుంది. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: కళ్యాణ్ ని తనూజ నిజంగా లవ్ చేస్తోందా ? సంతోషం పట్టలేక మ్యాటర్ బయటపెట్టేసిందిగా
భార్యతో విడాకుల రూమర్స్ ? స్టార్ డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్ వైరల్