కేటీఆర్! మాకు పెట్రోల్ ఉచితంగా దొరకడం లేదు... డింపుల్ హయాతి సంచలన ట్వీట్!

Published : Jul 20, 2023, 09:07 AM ISTUpdated : Jul 20, 2023, 09:11 AM IST
కేటీఆర్! మాకు పెట్రోల్ ఉచితంగా దొరకడం లేదు... డింపుల్ హయాతి సంచలన ట్వీట్!

సారాంశం

హీరోయిన్ డింపుల్ హయాతి హైదరాబాద్ ట్రాఫిక్ ఇక్కట్లపై అసహనం వ్యక్తం చేశారు. ఏమిటీ ట్రాఫిక్? పట్టించుకునే వారే లేరా? అని మండిపడ్డారు.   

డింపుల్ హయాతి ట్రాఫిక్ డీసీపీ ఎక్కడంటూ ప్రశ్నించింది. ఏకంగా మంత్రి కేటీఆర్, తెలంగాణా సీఎంఓ అకౌంట్స్ ని ట్యాగ్ చేస్తూ హైదరాబాద్ ట్రాఫిక్ దారుణంగా ఉందంటూ ట్వీట్ చేసింది. డింపుల్ హయాతీ డేరింగ్ కి జనాలు షాక్ అవుతున్నారు. డింపుల్ ట్రాఫిక్ జామ్ పై ఇలా మాట్లాడటం వెనుక బలమైన కారణమే ఉంది. హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డేతో డింపుల్ కి కోల్డ్ వార్ నడుస్తుంది. ఆయన్ని టార్గెట్ చేస్తూ డింపుల్ ఈ తరహా ట్వీట్ చేశారు. 

డీసీపీ రాహుల్ హెగ్డే కారణంగా డింపుల్ హయాతీ, ఆమె ప్రియుడు చట్టపరమైన చర్యలు ఎదుర్కొంటున్నారు. పార్కింగ్ ఏరియాలో ఉన్న తన కారును తన్నడంతో పాటు డ్రైవర్ ని దూషించిందంటూ రాహుల్ హెగ్డే డింపుల్ హయాతీ మీద కేసు బుక్ చేశాడు. ఈ కేసులో విచారణలో ఉంది. రాహుల్ హెగ్డే ఉద్దేశపూర్వకంగా నన్ను ఇరికించారు. నిజాలు త్వరలో తెలుస్తాయని వివాదంపై డింపుల్ హయాతి వివరణ ఇచ్చారు. 

ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే అంటే రగిలిపోతున్న డింపుల్ హయాతి ఓ ట్వీట్ చేశారు. ఇంటికి వెళ్లాలంటే గంటల సమయం పడుతుంది. ఎమర్జెన్సీ అయితే పరిస్థితి ఏంటీ? ట్రాఫిక్ డీసీపీ ఎక్కడ? అసలు హైదరాబాద్ లో కాలు బయట పెట్టగలమా? ప్రభుత్వ ప్రతినిధులారా మాకు పెట్రోల్ ఉచితంగా రావడం లేదు, అని ట్వీట్ చేసింది. సదరు ట్వీట్ కి మంత్రి కేటీఆర్, తెలంగాణా సీఎంఓ అధికారిక ట్విట్టర్ అకౌంట్స్ జోడించారు. 

డింపుల్ హయాతి ట్వీట్ వైరల్ అవుతుంది. కాగా డింపుల్ హయాతి కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేదు. ఆమె లేటెస్ట్ మూవీ రామబాణం డిజాస్టర్ అయ్యింది. గోపీచంద్ హీరోగా నటించారు. ఖిలాడి, రామబాణం చిత్రాలపై డింపుల్ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఫలితం మాత్రం బెడిసి కొట్టింది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Avatar 3: రిలీజ్‌కి ముందే 5000 కోట్లు.. ప్రీ రిలీజ్‌ బిజినెస్‌లో అవతార్‌ 3 సంచలనం.. బాక్సాఫీసు వద్ద డీలా
పూసలమ్మిన మోనాలిసా ఎంతగా మారిపోయిందో చూశారా