`హిరణ్య కశ్యప`.. తన నెక్ట్స్ సినిమా ప్రకటించిన రానా.. సీన్‌లోకి త్రివిక్రమ్‌..

Published : Jul 19, 2023, 10:26 PM IST
`హిరణ్య కశ్యప`.. తన నెక్ట్స్ సినిమా ప్రకటించిన రానా.. సీన్‌లోకి త్రివిక్రమ్‌..

సారాంశం

ఇప్పుడు మరో సినిమాని అనౌన్స్ చేశారు రానా. ఎప్పట్నుంచో చేయాలనుకున్న భారీ ప్రాజెక్ట్ `హిరణ్య కశ్యప`ని అనౌన్స్ చేశారు రానా. బుధవారం సాయంత్రం ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. 

హీరో రానా తన నెక్ట్స్  సినిమాని ప్రకటించారు. ఆ మధ్య దర్శకుడు తేజతో సినిమా చేయబోతున్నట్టు ప్రకటించారు. `నేనే రాజు నేనే మంత్రి` కాంబినేషన్‌లో సినిమా చేయబోతున్నట్టు తెలిపారు. ఇప్పుడు మరో సినిమాని అనౌన్స్ చేశారు రానా. ఎప్పట్నుంచో చేయాలనుకున్న భారీ ప్రాజెక్ట్ `హిరణ్య కశ్యప`ని అనౌన్స్ చేశారు రానా. బుధవారం సాయంత్రం ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. 

తన నెక్ట్స్ ప్రాజెక్ట్ `హిరణ్య కశ్యప` అని వెల్లడించారు. కామిక్స్ `అమరచిత్ర కథలు` స్ఫూర్తితో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు తెలిపారు. అంతే కాదు, ఇందులో మరో ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ లోకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ ఎంటర్‌ రావడం విశేషం. ఆయన ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు. అయితే దర్శకుడి పేరుని మాత్రం ప్రకటించలేదు. నిజానికి రానాతో ఈ సినిమాని దర్శకుడు గుణశేఖర్‌ ప్రకటించారు. కానీ అనుకోని కారణాలతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఇప్పుడు రానా నుంచి వచ్చిన ప్రకటనలో దర్శకుడి పేరు లేకపోవడం గమనార్హం. 

గుణశేఖర్‌ కాకుండా మరొకరు ఈ సినిమాని డైరెక్ట్ చేస్తారా? లేక ఆయనే రూపొందిస్తారా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా నిలిచింది. గుణశేఖరే దర్శకుడు అయి ఉంటే ఆయన పేరుని వెల్లడించేవారు. తాజా ప్రకటన బట్టి చూస్తుంటే వేరే దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కించే అవకాశం ఉంది. దీనికితోడు త్రివిక్రమ్‌ కథ అందిస్తున్నారంటే ప్రాజెక్ట్ లో ఆయన పార్ట్ చాలా ఉంటుంది. డైరెక్షన్‌ విభాగంలోనూ ఆయన ఇన్‌వాల్వ్ మెంట్‌ ఉంటుంది. ఈ లెక్కన కొత్త దర్శకులతో ఈ సినిమాని తెరకెక్కించే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాని స్పిరిట్‌ మీడియా నిర్మిస్తున్నారు. భారీగా దీన్ని తెరకెక్కించబోతున్నారు. 

రానా చివరగా `విరాటపర్వం` చిత్రంలో నటించారు. వేణు ఉడుగుల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో సాయిపల్లవి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా కమర్షియల్‌ గా ఆదరణ పొందలేకపోయింది. ఆ తర్వాత ఆ మధ్య తేజతో సినిమా ప్రకటించారు. ఇప్పుడు తన నెక్ట్స్ మూవీ `హిరణ్య కశ్యప` అని అనౌన్స్ చేశారు. మరి తేజతో సినిమా ఉంటుందా? లేదా? అనేది సస్పెన్స్ గా మారింది. ఎందుకంటే తన తమ్ముడు అభిరామ్‌ని హీరోగా పరిచయం చేస్తూ రూపొందించిన `అహింస` చిత్రం పరాజయం చెందింది. దీంతో రానా సినిమాపై డౌట్‌ నెలకొంది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Avatar 3: రిలీజ్‌కి ముందే 5000 కోట్లు.. ప్రీ రిలీజ్‌ బిజినెస్‌లో అవతార్‌ 3 సంచలనం.. బాక్సాఫీసు వద్ద డీలా
పూసలమ్మిన మోనాలిసా ఎంతగా మారిపోయిందో చూశారా