నీ మరణం అబద్దం అయితే బాగుండు... ఎమోషనల్ అయిన ఛార్మి!

Published : Feb 16, 2024, 02:47 PM IST
నీ మరణం అబద్దం అయితే బాగుండు... ఎమోషనల్ అయిన ఛార్మి!

సారాంశం

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ సతీమణి రూహి అకాల మరణం పొందారు. రూహి మరణం ఎంతో కలచి వేసిందని ఛార్మి ఎమోషనల్ అయ్యింది.   


హీరోయిన్ ఛార్మి సోషల్ మీడియా వేదికగా తన వేదన తెలియజేసింది. తన ఫ్రెండ్ రుహి మరణం నేపథ్యంలో ఆమె స్పందించారు. దర్శకుడు రాజమౌళి ఆస్థాన సినిమాటోగ్రాఫర్ గా ఉన్న సెంథిల్ కుమార్ సతీమణి రుహి అకాల మరణం చెందింది. అనారోగ్యం కారణంగా రూహి కన్నుమూశారు. రూహి యోగ ఇన్స్ట్రక్టర్. అలాంటి రూహి అకాల మరణం అందరినీ కలచివేసింది. రూహి మరణం పై ఛార్మి సోషల్ మీడియా పోస్ట్ పెట్టారు. 

రూహి నీ గురించి ఇలాంటి పోస్ట్ పెట్టాల్సి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. ఇప్పటికీ షాక్ లో ఉన్నాను. మాటలు రావడం లేదు. ఇది అబద్దం అయితే బాగుండు. చివరిసారి మనం కలసినప్పుడు కూడా ఎంతో సరదాగా గడిపాం. నిన్ను మిస్ అవుతున్నాను అనేది చిన్న పదం. నీ కుటుంబానికి శక్తిని ఆ భగవంతుడు ఇవ్వాలి. నీ ఆత్మకు శాంతి చేకూరాలి... అని ఛార్మి రాసుకొచ్చింది. 

అలాగే మంచు లక్ష్మి సైతం సుదీర్ఘ సందేశంలో తన వేదన వెళ్లగక్కింది. రూహితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంది. 2009లో సెంథిల్ కుమార్-రూహి ప్రేమ వివాహం చేసుకున్నారు. సెంథిల్ కుమార్ కి ఇద్దరు అబ్బాయిలు సంతానం. రూహి మరణంతో పిల్లలు ఆవేదన చెందుతున్నారు. రూహితో చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులతో పరిచయం ఉంది. 

PREV
click me!

Recommended Stories

రెండో భార్యతో కూడా దర్శకుడు విడాకులు ? మొన్న తమ్ముడు, ఇప్పుడు అన్న.. ఫోటోలు డిలీట్ చేసిన భార్య
Demon Pavan: రీతూ కంటే వాళ్లిద్దరూ హౌస్ లో ఉండడమే పవన్ కి ఇష్టమా.. తనూజపై నమ్మకం లేదంటూ..