యాత్ర 2 కి లేని అడ్డంకులు రాజధాని ఫైల్స్ చిత్రానికి ఎందుకు.. సోషల్ మీడియాలో ట్రోలింగ్

By tirumala ANFirst Published Feb 16, 2024, 1:54 PM IST
Highlights

 అమరావతి రాజధాని ఉద్యమ నేపథ్యంలో రాజధాని ఫైల్స్ అనే చిత్రాన్ని రిలీజ్ చేశారు. థియేటర్స్ లో రిలీజైన ఈ చిత్రాన్ని ఏపీలో అధికారులు మధ్యలోనే షోలు నిలిపివేసారు. 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల ఎఫెక్ట్ సినిమాల్లో కూడా కనిపిస్తోంది. ఎలక్షన్స్ దగ్గరపడే కొద్దీ పొలిటికల్ అజెండా బేస్డ్ చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. ఆల్రెడీ యాత్ర 2, రాజధాని ఫైల్స్ చిత్రాలు విడుదలయ్యాయి. త్వరలో ఆర్జీవీ వ్యూహం కూడా రిలీజ్ కి రెడీ అవుతోంది. యాత్ర 2 చిత్రం అధికార వైసిపికి అనుకూలంగా తెరకెక్కించిన చిత్రం. వైఎస్ జగన్ పాత్రని హైలైట్ చేస్తూ మహి వి రాఘవ్ తెరకెక్కించారు. 

అయితే గురువారం రోజు వైసీపీకి వ్యతిరేకంగా , అమరావతి రాజధాని ఉద్యమ నేపథ్యంలో రాజధాని ఫైల్స్ అనే చిత్రాన్ని రిలీజ్ చేశారు. థియేటర్స్ లో రిలీజైన ఈ చిత్రాన్ని ఏపీలో అధికారులు మధ్యలోనే షోలు నిలిపివేసారు. అభ్యంతర కర సన్నివేశాలు ఉన్నాయంటూ.. హై కోర్టు ఉత్తర్వులు అంటూ అధికారులు థియేటర్స్ కి వచ్చి మరీ ఈ చిత్ర ప్రదర్శన నిలిపివేసారు. 

ఈ క్రమంలో సోషల్ మీడియాలో ట్రోలింగ్ షురూ అయింది. యాత్ర 2 చిత్రం పైసా అజెండా నేపథ్యంలోనే వచ్చింది. ఆ చిత్రానికి లేని ఇబ్బంది రాజధాని ఫైల్స్ కి ఎందుకు అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. రాజధాని ఫైల్స్ చిత్రాన్ని భాను అనే దర్శకుడు తెరకెక్కించారు. అమరావతి రాజధానిని ఈ చిత్రంలో ఐరావతి అని చూపించారు. రైతుల ఉద్యమాన్ని హైలైట్ చేశారు. 

జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి రాజధానిని నీరుగార్చేలా కొన్ని ప్రతిపాదనలు జరిగాయి. ఏపీకి మూడు రాజధానులు అని ప్రకటించడంతో అమరావతి రైతులు ఉద్యమం మొదలయింది. ఈ చిత్రంలో సీఎం జగన్ ని పోలినట్లుగా ఒక పాత్ర సృష్టించి చులకన చేసే ప్రయత్నం చేశారని, కొన్ని వివాదాస్పద సన్నివేశాలు పెట్టారని అధికార పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. 

యాత్ర 2 చిత్రంలో కూడా జగన్ వ్యతిరేక రాజకీయ నాయకుల పాత్రలని తక్కువ చేసి చూపించారు. మరి అలాంటప్పుడు ఆ చిత్రాన్ని కూడా అడ్డుకోవాలి కదా అని ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా ఏపీ రాజకీయాలతో చిత్ర పరిశ్రమ కూడా వేడెక్కుతోంది. అయితే తాజాగా హై కోర్టు రాజధాని ఫైల్స్ రిలీజ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెన్సార్ మొత్తం సవ్యంగానే ఉండడంతో విడుదలకు అంగీకరించింది. 

 

 

click me!