Ananya Panday: ఆ పిక్ లీక్ చేస్తూ ప్రియుడికి అనన్య పాండే బర్త్ డే విషెస్!

Published : Nov 16, 2023, 06:10 PM ISTUpdated : Nov 16, 2023, 06:20 PM IST
Ananya Panday: ఆ పిక్ లీక్ చేస్తూ ప్రియుడికి అనన్య పాండే బర్త్ డే విషెస్!

సారాంశం

హీరోయిన్ అనన్య పాండే-ఆదిత్య రాయ్ కపూర్ మధ్య ఎఫైర్ నడుస్తుందని పుకార్లు వినిపిస్తుండగా... మరోసారి బలపరిచే పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆదిత్య రాయ్ కపూర్ కి అనన్య పాండే బర్త్ డే విషెస్ చెప్పిన తీరు చర్చకు దారి తీసింది.   

ఆదిత్య రాయ్ కపూర్ జన్మదినం నేడు. అభిమానులు, చిత్ర ప్రముఖులు ఆదిత్య రాయ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా హీరోయిన్ అనన్య పాండే బర్త్ డే విషెస్ ప్రత్యేకంగా నిలిచాయి. స్వయంగా తాను తీసిన ఆదిత్య రాయ్ కపూర్ పిక్ పోస్ట్ చేసిన అనన్య.. హ్యాపీ బర్త్ డే ఎస్ డీ, అని కామెంట్ పోస్ట్ చేసింది. అలాగే హార్ట్ ఎమోజీ షేర్ చేసింది. ఇది వారు ప్రేమలో ఉన్నారన్న అనుమానాలు బలపరిచే విధంగా ఉంది. 

అనన్య పాండే జన్మదిన వేడుకలకు వీరు జంటగా మాల్దీవ్స్ వెళ్లారనే వాదన ఉంది. గత ఏడాది ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా దివాలీ పార్టీ ఇచ్చారు. ఈ వేడుకకు ఆదిత్య రాయ్ కపూర్, అనన్య బ్లాక్ కలర్ ట్విన్ డ్రెస్ లో హాజరయ్యారు. సదరు పార్టీలో ఓ మూలన కూర్చుని ముచ్చట్లు చెప్పుకున్నారట. కాఫీ విత్ కరణ్ షోలో హోస్ట్ కరణ్ జోహార్ అనన్య పాండేను గుచ్చి గుచ్చి ఈ విషయం అడిగారు. అనన్య మాత్రం కన్ఫర్మ్ చేయలేదు. 

అనన్యతో పాటు షోలో పాల్గొన్న సారా అలీ ఖాన్ సైతం ఆదిత్య రాయ్ కపూర్ అనన్య లవర్ అంటూ టీజింగ్ చేసింది. కాగా ఆదిత్య రాయ్ కపూర్, అనన్య లవ్ ఎఫైర్ ని ఆమె తండ్రి చంకీ పాండే ఖండించడం విశేషం. గ్లామర్ ఇండస్ట్రీలో ఇలాంటి పుకార్లు సాధారణం అంటూ ఆయన కొట్టిపారేశారు. 

అనన్య తెలుగులో లైగర్ మూవీలో నటించింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ నిరాశపరిచింది. విజయ్ దేవరకొండతో అనన్య కెమిస్ట్రీ మాత్రం హైలెట్ అని చెప్పాలి. లైగర్ విజయం సాధిస్తే అనన్య కెరీర్ కి చాలా ప్లస్ అయ్యేది. ప్రస్తుతం అనన్య హిందీలో పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది. అనన్య  స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్. టైగర్ ష్రాఫ్ హీరోగా 2019లో విడుదలైంది. 

Ram Charan: రామ్ చరణ్ కోసం సాయి పల్లవి, బుచ్చి బాబు ప్రయత్నం ఫలించేనా..?

PREV
click me!

Recommended Stories

Annagaru Vostaru:అన్నగారు వస్తారా ? రారా ? బాలకృష్ణ తర్వాత కార్తీ సినిమాకు చుక్కలు చూపిస్తున్న హైకోర్టు
Ram charan మీద దేశాలు దాటిన ప్రేమ, మెగా పవర్ స్టార్ కోసం ఇండియా వచ్చిన ఫారెన్ అభిమానులు