Alia Bhatt: ఏంటి అలియా మళ్ళీ ప్రెగ్నెంటా? 

By Sambi Reddy  |  First Published Jan 23, 2023, 9:50 AM IST

హీరోయిన్ అలియా భట్ మరోసారి తల్లయ్యారంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇటీవల ఓ అమ్మాయిని కన్న అలియా ప్రెగ్నెంట్ అన్న న్యూస్ హాట్ టాపిక్ అయ్యింది. 
 


బాలీవుడ్ మన్మధుడు రన్బీర్ కపూర్ కి ప్లే బాయ్ ఇమేజ్ ఉంది. అధికారికంగానే ఓ అరడజను హీరోయిన్స్ తో రన్బీర్ ఎఫైర్స్ నడిపారు. కంత్రీనా, ప్రియాంక, దీపికా వంటి స్టార్ లేడీస్ ఈ లిస్ట్ లో ఉన్నారు. ఎందరో సుందరగాలతో సరసాలాడిన రన్బీర్ అలియా భట్ తో ఏడడుగులు వేశాడు. ఆమెతో బంధం మాత్రం పెళ్లి వరకూ వెళ్ళింది. రెండేళ్లకు పైగా ప్రేమించుకున్న రన్బీర్-అలియా 2022 ఏప్రిల్ 14న వివాహం చేసుకున్నారు. అత్యంత సన్నిహితుల మధ్య నిరాడంబరంగా వీరి వివాహం జరిగింది. 

కాగా పెళ్లికి ముందే అలియా ప్రెగ్నెంట్ అయ్యారని డెలివరీ అయ్యాక తెలిసింది. ఏప్రిల్ లో పెళ్లి చేసుకున్న అలియా నవంబర్ నెలలో ఆడపిల్లను కన్నారు. అంటే మధ్యలో ఏడు నెలల గ్యాప్ మాత్రమే ఉంది. ఇదే విషయాన్ని మీడియా ఆడిగితే ఆమె మొహమాటం లేకుండా అవును... పెళ్ళికి కాకుండానే గర్భం దాల్చానని నిర్భయంగా చెప్పింది. అది తప్పేమీ కాదంటూ నొక్కి వక్కాణించింది.

Latest Videos

అయితే అలియా మరోసారి తల్లి అయ్యారనేది హాట్ న్యూస్ గా మారింది. దీనికి కొన్ని ఆధారాలు చూపుతూ బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అలియా మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. నిజంగా అలియా గర్భం దాల్చితే ఏడాదిలోపే సెకండ్ చైల్డ్ ప్లాన్ చేసినట్లు అవుతుంది. పిల్లల కంటే కెరీర్ ముఖ్యం కాదని ఆల్రెడీ అలియా చెప్పారు. కెరీర్ పీక్స్ లో ఉండగా పెళ్లి చేసుకుని అమ్మ అయ్యారు, ఇది ప్రతికూల ప్రభావం చూపుతుందేమో అని మీడియా అడగ్గా. 

ఏం పర్లేదు. మాతృత్వం కంటే ఏదీ ఇంపార్టెంట్ కాదు. నా కెరీర్ పాడైనా, అవకాశాలు రాకపోయినా నేనేమీ బాధపడను అంటూ అలియా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అలియా రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని చిత్రం చేస్తున్నారు. కరణ్ జోహార్ దర్శకుడిగా ఉన్న ఈ చిత్రంలో రణ్వీర్ సింగ్ హీరో. అలాగే హార్ట్ ఆఫ్ స్టోన్ టైటిల్ తో ఓ హాలీవుడ్ మూవీ చేస్తున్నారు. 

click me!